బిజినెస్

2019లో అంతా మంచే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, డిసెంబర్ 12: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35.5 బిలియన్ డాలర్ల నికర లాభం వస్తుందని ప్రపంచ విమానాయాన రంగం భావిస్తోంది. ఇంధనం ధరలు తగ్గడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి పరిశ్రమలు పురోభివృద్ధికి దోహడపడుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఏటీఐ) స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 290 విమానయాన సంస్థలకు ఐఏటీఐ ప్రాతినిద్యం వహిస్తోంది. 2018లో 4.34 బిలియన్ల మంది ప్రయాణికులను చేరవేస్తుండగా, 2019లో 4.59 బిలియన్ల మంది ప్రయాణిస్తారని అసోసియేషన్ అంచనా వేస్తోంది. గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్ తాజా నివేదికను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. 2019లో ఐఏటీఐ నికర లాభం 35.5 బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొన్నారు. 2018లో ఇది 32.3 బిలియన్ డాలర్లగా ఉంది. ఈఏడాది 7.45 బిలియన్ డాలర్లుండగా 2019లో 7.75 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమ లాభాల్లో పయనిస్తుందన్న విశ్వాసం ఐఏటీఐ వ్యక్తం చేసింది. ప్రపంచ మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గడం, జీడీపీ స్థిరంగా ఉండడం ఆశాజనక పరిణామమని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈవో అలెగ్జాండర్ డీ జునియాక్ వెల్లడించారు.