బిజినెస్

హిందుజా పవర్ ప్రాజెక్ట్ రైల్, రోడ్డు మార్గాలకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/గాజువాక, జూలై 30: విద్యుదుత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఎన్‌పిసిఎల్) థర్మల్ ప్రాజెక్టుకు రైలు, రోడ్డు మార్గాలకు లైన్ క్లియరైంది. ఈ మేరకు హిందుజా యాజమాన్యం పరవాడ వద్ద గల సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు చెందిన రైలు మార్గాన్ని వినియోగించుకునేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసి) యాజమాన్యం అంగీకరించిందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. దీన్ని ఎన్‌టిపిసి అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలస వద్ద హిందుజా యాజమాన్యం 1,040 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రెండు యూనిట్లు నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తి చేసేందుకు హిందుజా యాజమాన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ పరిశ్రమకు రైలు, రహదారి మార్గాలు నేటి వరకూ లేవు. విద్యుదుత్పత్తికి అవసరమయ్యే బొగ్గును రైళ్ల ద్వారా దిగుమతి చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనికితోడు కనీసం ప్రాజెక్ట్‌కు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. హిందుజా యాజమాన్యం పరవాడ ప్రాంతానికి చెందిన గ్రామీణ రహదారులతోపాటు సింహాద్రి పవర్ ప్రాజెక్ట్(ఎన్‌టిపిసి)కి చెందిన రహదారులను అనధికారికంగా వాడుకుంటోంది. హిందుజా పవర్ ప్రాజెక్ట్‌కు రైలు మార్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేందుకు అత్యధిక సమయం పడుతుంది. దీంతో అక్కడికి అతి సమీపంలోగల ఎన్‌టిపిసికి చెందిన రైలు మార్గాన్ని విస్తరించుకునేందుకు హిందుజా అనుమతులు కోరింది. నిజానికి దీనిపై గత కొనే్నళ్ల నుండి ఎన్‌టిపిసి, హిందుజా యాజమాన్యం మధ్య తర్జ్భర్జనలు జరుగుతున్నాయి. మొదట్లో ఎన్‌టిపిసి యాజమాన్యం దీనికి అంగీకరించలేదు. ఎన్‌టిపిసి యాజమాన్యం సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు రైలు మార్గాన్ని, కామన్ కారిడార్‌ను నిర్మించుకునేందుకు వందల కోట్ల రూపాయలను వెచ్చించింది. రైతుకు పరిహారం చెల్లించి స్థల సేకరణ చేశారు. రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎన్‌టిపిసి యాజమాన్యం సొమ్మును కూడా చెల్లించింది. అయితే హిందుజా యాజమాన్యం మాత్రం సింహాద్రి నుండి హిందుజా ప్రాజెక్ట్ వరకు మాత్రమే రైలు మార్గాన్ని విస్తరించే విధంగా కేంద్ర ప్రభుత్వంలో గల పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి రైలు, కామన్ కారిడార్‌ను హిందుజా యాజమాన్యం విస్తరించుకునే విధంగా అనుమతులు మంజూరు చేసినట్లు అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్‌టిపిసి బోర్డు సమావేశంలో హిందుజాకు రైలు, రోడ్డు మార్గాన్ని పొడిగించుకునేందుకు అంగీకరించినట్లు అధికార వర్గాలు కూడా తెలిపాయి. ఎన్‌టిపిసి కామన్ కారిడార్ రోడ్డునూ మరింత విస్తరిస్తూ హిందుజా పవర్ ప్రాజెక్ట్ వరకు పొడిగించనుండగా, సింహాద్రికి చెందిన రైలు మార్గాన్ని కూడా హిందుజా వరకు పొడిగిస్తారు.
సొమ్ము ఎన్‌టిపిసిది... సోకు హిందుజాది!
వందల కోట్లు వెచ్చించింది ఒకరు.. ఇప్పుడు ఉచితంగా వాటిని అనుభవించాలని చూస్తున్నది మరొకరు. కోట్లు వెచ్చించింది ప్రభుత్వరంగ సంస్థయితే, అయాచితంగా వాటిపై హక్కులు దక్కించుకునేందుకు యత్నిస్తున్నది ప్రైవేటు సంస్థ. పవర్ ప్లాంట్ ముడిసరకు దిగుమతికి రవాణా సౌకర్యం లేకపోవడం, సంస్థకు నేరుగా రోడ్డు, రైలు మార్గాలు నిర్మించుకోవాలంటే భూసేకరణ అవసరం కావడం, వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించాల్సి రావడం, అదనపు ఖర్చుతోపాటు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుండటంతో హిందుజా తెలివిగా పావులు కదిపింది. కాగా, ఎన్‌టిపిసి కామన్ కారిడార్‌ను మరింత విస్తరించే పనులు చురుకుగా జరుగుతున్నాయి. పరవాడ మండల రెవెన్యూ అధికారులు ఇప్పటికే కారిడార్ విస్తరణకు భూసేకరణ పనులపై బిజీగా ఉన్నారు. కారిడార్ విస్తరణ జరిగితే ప్రభుత్వ భూములతోపాటు, వక్ఫ్ భూములు, ఎన్‌టిపిసి గతంలో సేకరించిన భూములు కోల్పోయే అవకాశం ఉంది. అయితే భూములు కోల్పోయే రైతాంగానికి, లేదా ప్రభుత్వానికి హిందుజా ఏ విధంగా పరిహారం చెల్లిస్తుందో తెలీదు. ఎన్‌టిపిసి అభివృద్ధి పరిచిన వౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే విషయంలో కూడా హిందుజా సంస్థ చెల్లిం చే పరిహారంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తాని కి కోట్లు ఖర్చు చేయకుండానే హిందుజా సంస్థ అప్పనంగా ఎన్‌టిపిసి రైల్వే లైన్, కామన్ కారిడార్‌ను ఎంచక్కా ఉపయోగించుకుని, వ్యాపారం చేసుకోనుందన్నమాట.