బిజినెస్

జెట్ ఎయిర్ వేస్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: నరేష్ గోయెల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్ వేస్ సంస్ధకు సలహాదారు హోదాలో మూడోసారి తిరిగొచ్చిన మాజీ సీఈవో నికోస్ కర్దాస్సిస్ మరోమారు సంస్థకు గుడ్‌బై చెప్పారా..అవుంనంటున్నాయి ఆ సంస్థ విశ్వసనీయ వర్గాలు. ఫుల్ సర్వీస్ కేరియర్‌గా పేరేన్నికగన్న జట్ ఎయిర్ వేస్ ఈ యేడాది జనవరి నుంచి పనితీరులో ఆర్థిక పరమైన లక్ష్యాల సాధనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో గత మే నెలలో నికోస్ కర్దాస్సిస్ ఈ సంస్ధ సలహాదారు పాత్రను చేపట్టారు. గ్రీక్-అమెరికన్ వైమానిక సంస్థకు చెందిన ఈ వెటరన్ జెట్ ఎయిర్ వేస్‌ను గాడిలో పెట్టేందుకు, అదృష్టాన్ని పుణికిపుచ్చుకునేలా చేసేందుకు కృషి చేశారు. ప్రత్యేకించి ‘టర్న్ అరౌండ్’ ప్రణాళికను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసేందుకు యత్నించారు. ఐతే గత నవంబర్ మాసంలో సెలవుపెట్టి స్వదేశానికి వెళ్లిన నికోస్ కర్దాస్సిస్ ఆ తర్వాత తిరిగి రాలేదని ఆ సంస్థ అభివృద్ధి విభాగానికి చెందిన విశ్వసనీయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. గోయెల్ తన పెట్టుబడుల వాటాదారు ఎతిహాడ్ ఎయిర్ వేస్‌తో నిధుల సమీకరణ విషయంపై చర్చలు ప్రారంభించగా ఆ సమయంలో కర్దాస్సిస్ కీలకంగా వ్యవహరించి మార్గం సుగమం చేశారని తెలిసింది. ఐతే ఈవిషయాలపై వివరణ ఇచ్చేందుకు జెట్ ఎయిర్‌వేస్ సంస్ధ నిరాకరించింది. ఇలావుండగా వరుసగా మూడు త్రైమాసికాల్లో నష్టాలు చవిచూసిన జెట్‌ఎయిర్ వేస్ సెప్టెంబర్ మాసాంతానికి 8,052 కోట్ల అప్పుల్లో మునిగింది. ఈ క్రమంలో ఈ వైమానిక సంస్థ ‘టర్న్ అరౌండ్’ అనే ప్రణాళికను ప్రవేశపెట్టింది. వ్యయాన్ని అదుపుచేసి ఆదాయాన్ని పెంపొందించడాన్ని ఈ ప్రణాళికలో పొందుపరిచారు. నిధుల సమీకరణకు కూడా సంస్థ నిర్ణయించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాడ్ ఎయిర్‌వేస్‌కు గత 2013 నుంచి జెట్‌ఎయిర్ వేస్‌లో 24శాతం వాటా వుంది. దీంతో ఆ వాటాదారు సహకారం తీసుకుని జెట్ ఎయిర్ వేస్‌ను గాడిలో పెట్టేందుకు 2013లోనే కర్దాస్సిస్ అప్పటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో లోతైన చర్చలు సాగించారు. అయితే అనూహ్యంగా అదే సమయంలోనే కర్దాస్సిస్ సంస్థనుంచి వైదొలిగారు. కానీ 2018 ఆర్థిక సంవత్సరంలో 636.45 కోట్ల నష్టాలను సంస్థ మూటగట్టుకోవడంతో అధినేత గోయెల్ తిరిగి కర్దాస్సిస్‌ను బతిమాలి సంస్థ బోర్డులోకి తీసుకువచ్చినా దీర్ఘకాలంగా ఉంచుకోలేకపోయారు. గతంలో కర్దాస్సిస్ 1994 నుంచి 1999వరకు జెట్ ఎయిర్ వేస్ సీఈవోగా నియమితులై మొత్తం 14 సంవత్సరాలపాటు ఆ హోదాలో విజయవంతగా పనిచేసిన వ్యక్తిగా గణుతికెక్కారు.