బిజినెస్

జీఎస్‌టీ మరింత సరళతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 18: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానాన్ని మరింత సరళతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, 99శాతం వస్తువులను 18శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ప్రధాని మోదీ తెలిపారు. జీఎస్‌టీ విధానం అమలులోకి వచ్చినప్పుడు రిజిస్టరైన సంస్థలు 65లక్షలు మాత్రమేనని, ఇప్పుడు వీటి సంఖ్య మరో 55లక్షలు పెరిగిందని అన్నారు.
మంగళవారంనాడు ఇక్కడ రిపబ్లిక్ సమ్మిట్‌లో మాట్లాడిన నరేంద్ర మోదీ ‘మొదట్లో కొంత సందిగ్ధత ఏర్పడినప్పటికీ ఇప్పుడు జీఎస్‌టీ విధానం బలంగా వేళ్లూనుకుంది. దీని దృష్ట్యా 99శాతం వస్తువులను 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. లగ్జరీ వస్తువుల వంటి అతి తక్కువ శాతం వస్తువులనే 28శాతం శ్లాబు పరిధిలో ఉంచుతామని ఉద్ఘాటించారు. అన్ని వ్యాపార సంస్థలకు తేలిగ్గా ఉండేలా జీఎస్‌టీని రూపొందించాలన్నదే ప్రభుత్వ యోచన అని చెప్పారు. మొదట్లో అప్పటి వ్యాట్ లేదా ఎక్సైజ్ పన్ను విధానాల ప్రకారమే జీఎస్‌టీని రూపొందించడం జరిగింద పేర్కొన్న ఆయన అనంతరం జరిగిన విస్తృత చర్చల ప్రాతిపదికగా ఇది ఎప్పటికప్పుడు మెరుగవుతూ వచ్చిందని అన్నారు. దీర్ఘకాలంగా దేశంలో జీఎస్‌టి డిమాండ్ ఉందని గుర్తు చేసిన ప్రధాని తమ ప్రభుత్వం అంతిమంగా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చిందని, ఫలితంగా వాణిజ్య మార్కెట్‌లో ఉన్న వైరుధ్యాలన్నీ తొలగిపోయాయని చెప్పారు.
పైగా, ఈ వ్యవస్థ సామర్థ్యం ఎప్పటికప్పుడు పదునెక్కుతూ వస్తోందని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతా ఇనుమడించిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న స్థాయిలో పన్నుల సంస్కరణలు అమలు చేయాలన్నా అంత తేలిక్కాదని, అదే భారత దేశంలో అత్యంత చారిత్రక రీతిలో జీఎస్‌టీని తాము ఎలాంటి సమస్య లేకుండా అమలు చేయగలిగామన్నారు.