బిజినెస్

కొనసాగుతున్న బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 19: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్ రన్ కొనసాగుతున్నది. వరుసగా ఏడో రోజు కూడా లాభాలను ఆర్జించింది. 137.25 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 36,484.33 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ పెరుగుదల కారణంగా లాభపడిన కంపెనీల్లో ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ ఉన్నాయి. రూపాయి మారకపు విలువ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌లో బుధవారం నాటి ట్రేడింగ్‌ను ప్రభావితం చేశాయి. ఈనెలలో ఇప్పటి వరకూ బ్యాంగేతర ఆర్థిక సంస్థలతోపాటు ఇతర ప్రధాన కంపెనీలకు ఊతమివ్వడానికి మార్కెట్‌లో ద్రవ్య లబ్ధతను 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలకు రిజర్వ్ బ్యాంక్ పెంచడంతో బీఎస్‌ఈలో లావాదేవీలు ఉత్సాహభరితంగా సాగాయి. మదుపరులకు కూడా ఈ అంశం కలిసివచ్చిందని చెప్పాలి. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐతోపాటు మారుతీ సుజికీ, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. కాగా, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, వెదాంత షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్‌లో ద్రవ్య లబ్ధతను పెంచాలన్న ఆర్‌బీఐ నిర్ణయం సత్ఫలితలను ఇస్తున్నట్టే కనిపిస్తున్నది. అంతేగాక, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ఈనెల పెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. బీఎస్‌ఈలో సెనె్సక్స్ వరుస లాభాలతో ముందుకు దూసుకెళ్లడానికి ఇది కూడా ఒక కారణం. కాగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కూడా లాభాలను కొనసాగిస్తున్నది.
నిఫ్టీ 58.60 పాయింట్లు పెరగడం ద్వారా 10,967.30 పాయింట్లకు చేరుకుంది. మొత్తం మీద వరుసగా ఏడు రోజుల్లో సెనె్సక్స్ 1,387 పాయింట్లు పెరగడం స్టాక్ మార్కెట్ మలపడుతున్నదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. అంతకు ముందు వరుస నష్టాలతో కుంగిపోయిన మార్కెట్‌కు వరుసగా ఏడో రోజు కూడా లాభాలను నమోదుచేయడం ఊరటనిస్తున్నది. కాగా, నిఫ్టీ సైతం లాభాలను ఆర్జించగా, ఇండియాబుల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. కాగా, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్, కోటక్ మహీంద్ర షేర్లు నష్టాలను చవిచూశాయి.