బిజినెస్

త్రైమాసికంలో తగ్గిన ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు గడచిన త్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మొత్తం 8,414 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈక్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ పథకాల కింద మొత్తం 82,200 కోట్ల రూపాయలు పెట్టుబడులు సమకూరాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈక్విటీ, లేదా దాని అనుంబంధ పొదుపు పథకాల్లోకి గత ఏప్రిల్ మాసం నుంచి నవంబర్ వరకు వచ్చిన మొత్తం గత యేడాది ఇదేకాలానికి వచ్చిన 12,622 కోట్ల రూపాయలకన్నా చాలా తక్కువ మొత్తమని ఆ గణాంకాలు వివరించాయి.
ఈ పథకాలోకి సెప్టెంబర్‌లో 11,172 కోట్లు, ఆగస్టులో 8,375 కోట్లు మదుపుచేశారు, గత కొన్ని నెలల కాలంగా మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా ఈవిషయంలో రీటెయిల్ మదుపర్లు విజ్ఞతతో వ్యవహరించి పెట్టుబడులను మార్కెట్లలో కొనసాగించారని ఏఎంఎఫ్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్‌ఎస్ వెంకటేష్ ఈసందర్భంగా తెలిపారు. ఆర్థిక మాంద్యంతో ఒక వైపు ఇబ్బందుల పాలు చేస్తున్నా మన దేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచివుందని, భవిష్యత్తులో ఈక్విటీలు మంచి లాభాలను సమకూర్చి పెట్టే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు.
అయితే ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల పథకం (ఎస్‌ఐపీ) ద్వారా సమకూరిన నిధుల విషయంలో మాత్రం నిలకడ కనబడుతోందని, గత నెలలో 7,985 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా సమకూరాయన్నారు. కాగా మ్యూచువల్ ఫండ్లలోకి గత నెల మొత్తానికి 1.4 కోట్ల పెట్టుబడులు రాగా, ద్రవ్య నిధులు 1.36 లక్షల కోట్లు, బంగారం మారకం ద్వారా 10 కోట్లు సమకూరాయి. 6,518 కోట్ల రూపాయలు మదుపర్లు వెనక్కు తీసుకోవడం జరిగింది.