బిజినెస్

సింగరేణి కార్మికుల క్రమబద్ధీకరణపై ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: సింగరేణి బొగ్గుగనుల్లో పని చేస్తున్న కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణతోపాటు పదోన్నతలకు సింగరేణి యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య గురువారం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానంగా మూడు అంశాలపై ఒప్పందం కుదిరింది. పారిశ్రామిక వివాదాల చట్టం, త్రైమాసిక ఒప్పందాలు, సెక్షన్ 12(3)పై రాజీఫార్ములా కుదిరింది. సింగరేణి భవనంలో జాతీయ కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి యాజమాన్యం మధ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సింగరేణిలో క్లరికల్, పారామెడికల్ తదితర 35 కేడర్లకు సంబంధించిన విభాగాల్లో పదోన్నతలకు అవకాశం లభించింది. ఒప్పందాల కారణంగా సింగరేణిలో 1200 మందికి పదోన్నతులు దక్కాయి. పదోన్నతుల కారణంగా సంస్థపై ఏటా రూ. 3.60 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని యాజమాన్యం తెలిపింది. అలాగే వివిధ అలవెన్స్‌లు, చార్జీల అలవెన్సుల్లో వంద శాతం పెంచారు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 900 మందికి బదిలీలకు అవకాశం కలిగింది. సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి యాజమాన్యం చారిత్రాత్మక ఒప్పందం చేసుకోవడంలో సంస్థ సీఎండీ శ్రీ్ధర్ కృషిని అభినందించారు. సింగరేణి కార్మిక నేతల తరుపున వీరభద్రయ్యతో పాటు ఎనిమిది మంది మంది యూనియన్ నేతలు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన ఏరియాల జనరల్ మేనేజర్లు హాజరైనట్టు సంస్థ సీపీఆర్‌ఓ మహేష్ చెప్పారు.