బిజినెస్

మూడు బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లాంఛనంగా ఆమోదం తెలిపిందనీ, ప్రత్యామ్నాయ విధానం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిందనీ బ్యాంక్ ఆఫ్ బరోడా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ మూడు బ్యాంకుల విలీనం ప్రతిపాదన ఈ ఏడాది 29న తెరపైకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనమవుతాయి. ట్రాన్ఫరీ బ్యాంక్ హోదాలో బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం ప్రక్రియను వేగవంతం చేసింది. కాగా, ట్రాన్ఫరర్ బ్యాంకులైన దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ ఇప్పటికే విలీన ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృత సేవలు అందించాలని, అందుకే బ్యాంకులు మరింత బలోపేతం కావలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జోధ్‌పూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా (ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కూర్ (ఎస్‌బీటీ), భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం కావడం దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగం బ్యాంకులు విస్తృత స్థాయిలో సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎస్‌బీఐలో పలు బ్యాంకుల విలీనాన్ని ప్రోత్సహించి, సరికొత్త బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహజంగానే మూడు బ్యాంకుల విలీనానికి సానుకూలంగా ఉంటారు. ఇలావుంటే, లాంఛనప్రాయమైన ఆమోద ముద్రలను మినహాయిస్తే, విలీనం ప్రక్రియ మొదలు పెట్టేందుకు మార్గం సుగమమైందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన ప్రకటనలో తెలిపింది. మూడు బ్యాంకులు విలీనమైతే, ఆర్థిక లావాదేవీల విలువ 14.82 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది.

.