బిజినెస్

‘బేర్’మన్న స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 21: ఈవారం లావాదేవీల చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ ‘బేర్’మంది. 689.60 పాయింట్లు (1.89 శాతం) పడిపోయిన సెనె్సక్స్ 35,742.07 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 197.70 పాయింట్లు (1.81 శాతం) పతనమై, 10,754 పాయింట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడు రోజుల వరుస లాభాల తర్వాత గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలు తప్పవన్న సంకేతాలు కనిపించాయి. కానీ, చివరిలో కోలుకున్న మార్కెట్ కేవలం 52.66 పాయిట్ల నష్టంతో గట్టెక్కింది. అమెరికా రిజర్వ్ ఫండ్ (ఫెడ్ రిజర్వ్) వడ్డీ రేట్లను సవరించడం ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)పై పెద్దగా ప్రభావం చూపదన్న ధైర్యంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ మొదలైంది. ప్రారంభంలో కొంత సానుకూల వాతావరణం కనిపించినప్పటికీ, క్రమంగా వాటాల అమ్మకాల ఒత్తిడి పెరగడం మొదలైంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటును పెంచడం వల్ల చోటు చేసుకోబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, మదుపరులు వాటాలను అమ్మడానికే మొగ్గు చూపారు. దీనితో మధ్యాహ్నం తర్వాత ట్రేడింగ్ మొత్తం అమ్మకాల ఒరవడితోనే కొనసాగింది. అమెరికాకు సంబంధించిన కీలక రహస్యాలను చైనా పౌరులు సంగ్రహించారన్న వార్త ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి కారమైంది. ఇప్పటికే అమెరికా, చైనా దేశాలు వాణిజ్య యుద్ధంలో మునిగితేలుతున్నాయి.
తాజా పరిణామం కూడా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. సూచీలు ప్రతికూలంగా ఉండడంతో, బీఎస్‌ఈకి కూడా దాని తాకిడి తప్పలేదు. చాలా రోజుల తర్వాత మొదటిసారి స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల జోరు కనిపించింది. అంతర్జాతీయంగా వృద్ధిరేటు తగ్గుముఖం పట్టిందన్న వార్తలు కూడా స్టాక్ మార్కెట్ లావాదేవీలను శాసించాయి. రూపాయి మారకపు విలువ ఆశించిన స్థాయిలో బలపడకపోవడం ఐటీ, టెక్నాలజీ రంగాల స్టాక్స్‌ను దెబ్బతీశాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, మారుతీ, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. సగటున నాలుగు శాతం విలువను కోల్పోయి, వచ్చే వారం పరిస్థితిపై అనుమానాలకు కారణమయ్యాయి. మొత్తం మీద శుక్రవారం నాటి మార్కెట్ పరిస్థితిని గమనిస్తే, వచ్చే వారం ఎంత వరకూ కోలుకుంటుందనే ఆందోళన ట్రేడ్ బ్రోకర్లను వెంటాడుతున్నది.