బిజినెస్

మూడో త్రైమాసిక ఫలితాలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, డిసెంబర్ 22: మదుపరులు వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న వివిధ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై దృష్టి కేంద్రీకరి స్తున్నారు. భారీ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన తరుణం అదేనని భావిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈవారం స్టాక్ మార్కెట్ అనూహ్య పతనానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు. ఇలా వుంటే, చాలా కంపెనీలు ఆలస్యంగా ద్వైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్నాయ. ఈనెల చివరి వరకూ ఈ ప్రక్రియ కొనసాగినా ఆశ్చర్యం లేదు. కాగా, రిలాక్సో ఫుట్‌వేర్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 23 శాతం అదనపు లాభాలను అందుకుంది. అలాగే ఇదే కాలానికి రూ.39 కోట్ల పన్నులు ఈ సంస్థ చెల్లించింది. గతేడాది ఇదే కాలానికి ఈ కంపెనీ రూ.32 కోట్ల పన్ను చెల్లింపులు చేసి లాభాలను గడించిందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో అధికారులు వివరించారు. అలాగే ఈ ఫుట్‌వేర్ తయారీ సంస్థ ఈ త్రైమాసికంలో ఆదాయంలో 19 శాతం వృద్ధి నమోదుచేసి రూ.545 కోట్లు సమకూర్చుకుంది. గతేడాది ఇదేకాలంలో రూ.460 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ ఆర్థిక వ్యయాన్ని సైతం 1.9 కోట్ల నుంచి 1.2 కోట్ల కు తగ్గించుకుంటూ వస్తోంది. టర్మ్ లోన్లను తగ్గించుకోవడం, వర్కింగ్ క్యాపిటల్‌ను తక్కువగా వినియోగించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతోందని అధికారులు వివరించారు. రూ.500 నుంచి 1000 వరకు ధర పలికే పాదరక్షల మీద జీఎస్టీ రేట్లను 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ వినియోగదారులకు ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ కుమార్ దువా తెలిపారు. ఇంధన థరల పెరుగదల కారణంగా కొన్ని ముడి సరుకుల ధరలు పెరిగాయని ఆయన వెల్లడించారు.