బిజినెస్

భారత స్టాక్ మార్కెట్‌పై వాల్ స్ట్రీట్ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా స్టాక్ మార్కెట్ లావాదేవీల కేంద్రం వాల్ స్ట్రీట్‌కు ఎదురైన సంక్షోభం భారత మార్కెట్‌ను దెబ్బతీసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.50 శాతం పెంచడం వాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ పతనం ఈవారం 7 శాతంగా నమోదై, 22,445.37 పాయింట్ల వద్ద ముగిసింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత వాల్ స్ట్రీక్ ఒక వారంలో ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనాతో తీవ్రమవుతున్న వాణిజ్య యుద్ధానికి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం కూడా జత కూడడంతో అమెరికా వాణిజ్య రంగంలో భయాందోళనలు నెలకొన్నాయి. వీటి ప్రభావం వాల్ స్ట్రీట్‌ను నష్టాల్లో నడిపించింది. అమెరికాలో స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను అనుసరించే ప్రపంచ స్టాక్ మార్కెట్లు నడుస్తాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. వడ్డీ రేట్లపై రిజర్వ్ ఫండ్ తీసుకున్న నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌ను కూడా కుదిపేసింది. రూపాయి మారకపు విలువ బలపడడం, ముడి చమురు ధర తగ్గుదల వంటి అంశాలు ప్రభావితం చేసినప్పటికీ, అమెరికా రిజర్వ్ ఫండ్ నిర్ణయం సెనె్సక్స్ పతనానికి ప్రధాన కారణమైంది. సోమవారం నుంచి మొదలయ్యే కొత్త వారంలో మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని రేపుతున్నది.