బిజినెస్

త్వరలో కొత్త రూ.20 నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: రిజర్వు బ్యాంకు నుంచి కొత్తగా 20 రూపాయల కరెన్సీ నోటు అదనపు హంగులతో విడుదల కాబోతోంది. సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన డాక్యుమెంట్ మేరకు ప్రస్తుతం చలామణిలో ఉన్న 4.92 బిలియన్ల రూ.20 కరెన్సీ నోట్లతోబాటు సరికొత్త రూ. 20 నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత నోట్ల సంఖ్యకు రెండు రెట్లుగా సుమారు 10 బిలియన్ కొత్త 20 రూపాయల నోట్లు వచ్చే యేడాది మార్చి నాటికి విడుదల చేయాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఇది అమలైతే ప్రస్తుతం చలామణిలోవున్న అన్ని రకాల కరెన్సీ మొత్తంలో రూ. 20 నోట్లు 9.8 శాతాన్ని ఆక్రమిస్తాయి. ఇప్పటికే సెంట్రల్ బ్యాంకు కొత్త హంగులతో కూడిన కరెన్సీ నోట్లను రూ.10, రూ. 50, రూ.100, రూ.200, రూ.500, రూ. 2000 డినామినేషన్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2016 నవంబర్ నుంచి మహాత్మాగాంధీ కొత్త సిరీస్ కింద కొత్త రకాల నోట్లను విడుదల చేయడాన్ని రిజర్వు బ్యాంకు ఆరంభించింది. గతంలో విడుదల చేసిన నోట్ల సైజు, డిజైన్లకు పూర్తి భిన్నంగా ఈ సరికొత్త నోట్లు రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.