బిజినెస్

సరికొత్త జాతీయ వాహనాల చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశాన్ని కాలుష్య రహితంగా మార్చే లక్ష్యంతో వాహన రంగంలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు వచ్చే యేడాది ‘ఫేమ్-2’ పేరిట కొత్తగా జాతీయ మోటారు వాహనాల చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. ‘అంతర్జాతీయ పరిస్థితులను పరిశీలిస్తే మన దేశంలో ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సిన అవరం ఉంద’ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని, ఈ క్రమంలో పచ్చదనాన్ని పెంచడంతోబాటు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తరించాల్సి వుందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.ప్రధానంగా ఇందుకోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని మంగళవారం నాడిక్కడ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి తెలిపారు. వాతావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించని వాహనాల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేయనుందన్నారు. వచ్చే యేడాది విద్యుత్ వాహనాల అమ్మకాలు ద్విగుణీకృతం అవుతాయని, సుమారు రెండు లక్షల వాహనాలు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని వాహనాల తయారీ కర్మాగారాల సొసైటీ (ఎస్‌ఎంఈవీ) అంచనా వేసిందని అనంత్ గీతే తెలిపారు. కొత్త విధానానికి ఇది వెన్నుదన్నుగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త వాహనాలా చట్టంలో భాగంగా ఇదివరకు తీసుకువచ్చిన తొలి పథకం ‘ఫేమ్-1’కు మంచి స్పందన వచ్చిందని, ఈ నేపథ్యంలోనే ఫేమ్-2కు సంబంధించిన ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశామని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపే ఈ ప్రతిపాదనకు సైతం ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. మన దేశంలో హైబ్రీడ్ వాహనాలు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగవంతంగా విస్తరించడానికి ఫేమ్-2 పథకం ద్వారా ప్రత్యేక రాయితీలను సైతం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ యేడాది ప్రథమార్థంలో విడుదలైన కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆటోమొబైల్ పాలసీ డ్రాఫ్ట్‌లో వాహన రంగంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2028 నాటికి జాతీయ బెంచ్ మార్కుకు అనుగుణంగా అత్యుత్తమ విలువలతో కూడిన శుభ్రత, భద్రతలను మనదేశ వాహన రంగంలో పాదుకొల్పేలా కొత్త చట్టం ద్వారా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలంటే ప్రధానంగా ఆటోమొబైల్ పరిశ్రమల చేయూత అవసరమన్నారు. కాగా విద్యుత్ వాహనాలపై సబ్సిడీని ఎత్తివేయడం వల్ల ఆమ్ల బ్యాటరీల వినియోగం, తక్కువ స్పీడుగల ద్విచక్ర వాహనాల వినియోగం గాడిలోపడి తద్వారా విద్యుత్ వాహనాల ప్రాముఖ్యత పెరిగేందుకు వీలవుతుందని విద్యుత్ వాహనాల తయారీదారుల సొసైటీ (ఎస్‌ఎంఈవీ) డైరెక్టర్ జనరల్ సోహీందర్ గిల్ తెలిపారు.