బిజినెస్

వారసత్వ పన్ను వల్లే భారీ విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హయాంలో రద్దయిన వారసత్వ పన్ను అంశాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా తెరపైకి తెచ్చారు. అమెరికా, యూరప్ లాంటి అనేక పశ్చిమ దేశాల్లో ఈ పన్ను అమలులో ఉండటం వల్ల అక్కడి ఆసుపత్రులు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలకు భారీగా విరాళాలు అందుతున్నాయని, కాని భారత్‌లో అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. మంగళవారం ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆరోగ్యరంగం, విద్యాసంస్థలకు సరిపడా నిధులను సమకూర్చాల్సిన అవసరాన్ని గూర్చి మాట్లాడిన ఆయన మనదేశంలో మత సంస్థలు, సీఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారానే విరాళాలు అందుతున్నాయని తెలిపారు. అయితే అంతర్జాతీయంగా చాలా ఆసుపత్రులకు భారీగానే విరాళాలు అందుతున్నాయని తెలిపారు. మాజీ విద్యార్థులు సహా అనేక మంది ఈ రకమైన విరాళాలను తమ కృతజ్ఞతకు సంకేతంగా తాము చదువుకున్న సంస్థలకు అందిస్తున్నారని తెలిపారు. జీవితంలో స్థిరపడిన తరువాత తాము చదువుకున్న సంస్థలకు విరాళం ఇచ్చే సంస్కృతి ఉందని, తమకు తోచిన రీతిలో ఈ మాజీ విద్యార్థులు సాయపడుతూనే ఉంటారని తెలిపారు. అయితే భారతదేశంలో కొన్ని ఐఐటీలు ఈ రకమైన సంస్కృతికి శ్రీకారం చుట్టాయని, అయితే ఇది అనుకున్నంతగా పరివ్యాప్తం కాలేదని అన్నారు. అమెరికా, ఐరోపాకు చెందిన కొన్ని ఆసుపత్రులకు అందే విరాళాలు బిలియన్ల కొద్దీ డాలర్లమేర ఉన్నాయని, వీటి ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు, రోగులు విరాళాలు సమకూరుస్తున్నారని అన్నారు. మనదేశంలో ఆ రకమైన పరిస్థితి ఎందుకు ఉండకూడదన్నది తమ ఆలోచన అని పేర్కొన్న ఆయన ఇందుకు ప్రధాన కారణం పశ్చిమ దేశాల సమాజంలో వారసత్వ పన్ను ఉండటమేనని వెల్లడించారు. అందుకే చాలామంది తమ వృద్ధాప్యంలో ఈ వారసత్వ ధర్మకతృత్వ సంస్థలకు విరాళాలు అందిస్తున్నారని తెలిపారు. మనకు వారసత్వ పన్ను లేదు కాబట్టి మన చారిటీలకు అంత భారీ స్థాయిలో విరాళాలు రావడం లేదని అన్నారు. సామాజికపరమైన విరాళాల పైనే దేశంలోని చారిటీ సంస్థలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు మత, కుల ప్రాతిపదికన ఆయా కమ్యూనిటీలు ఏర్పాటు చేశాయని, ఈ నేపథ్యంలో తాము కొత్త అంకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)ని ప్రారంభించామని, కంపెనీల చట్టం ప్రకారం కొన్ని లాభదాయక సంస్థలు తమ మూడేళ్ల వార్షిక లాభాల్లో రెండు శాతాన్ని విరాళంగా ఇవ్వాలన్న నిబంధనను తీసుకువచ్చామని పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ ద్వారా ఈ పన్నులను వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
చిత్రం..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ