బిజినెస్

ఈక్విటీల ద్వారా ఈ యేడాది రూ.63,744 కోట్ల రాబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈ ఏడాది మన దేశానికి చెందిన కంపెనీలు వివిధ ఈక్విటీ మార్కెట్ల ద్వారా 63.744 కోట్ల రూపాయల నిధులు ఇప్పటి వరకు సమకూర్చుకున్నాయి. గత సంవత్సరం వచ్చిన ఆల్‌టైం రికార్డు స్ధాయి 1.6 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది సమకూరిన మొత్తం దాదాపు 60 శాతం తక్కువ. ప్రైమ్ డేటాబేస్ కంపెనీ అందజేసిన గణాంకాల మేరకు ఈక్విటీల్లో భాగంగా 29,944 కోట్ల రూపాయలు బాండ్ల వంటి పబ్లిక్ ఇస్యూల ద్వారా ఈ సంవత్సరం సమకూరింది. అలాగే పబ్లిక్ ఈక్విటీ మార్కెట్ల ద్వారా రూ. 63,744 కోట్లు సమకూరాయి. ఇక అధిక భాగం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓలు) ద్వారా 33,244 కోట్ల రూపాయలు చేకూరింది. క్వాలిఫైడ్ ఇండస్ట్రియల్ ప్లేస్‌మెంట్స్ (క్యూఐపీ) ద్వారా 16.077 కోట్ల మొత్తం కంపెనీలు సమకూర్చుకున్నాయి. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పథకం ద్వారా స్టాక్ ఎక్చేంజీ వ్యవస్థల నుంచి 10,678 కోట్ల రూపాయలు, వౌలిక పెట్టుబడుల ట్రస్టు (ఐఎన్‌ఐటీఎస్) సహకారంతో మరో రూ.3,145 కోట్లు సమకూరాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. 24 ప్రధాన బోర్డుల్లో ప్రాథమిక పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓలు) ద్వారా రూ.30,959 కోట్ల సమకూరాయి. గత యేడాది 36 ఐపీఓల ద్వారా సమకూరిన 67,147 కోట్ల మొత్తానికి ఈ యేడాది వచ్చిన మొత్తం చాలా తక్కువ. మొత్తానికి ఐపీఓ విభాగంలో చిన్న, మధ్య తరహా కంపెనీలు మంచి పనితీరును కనబరచి ఈయేడాది 2,254 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆర్జించాయి. గత యేడాది వచ్చిన 1.679 కోట్లకంటే ఇది చాలా అధికమని ప్రైమ్ డేటాబేస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హాల్దియా తెలిపారు. మొత్తానికి ఐపీఓల ప్రధాన బోర్డు విభాగంలో ఈయేడాది ప్రజాస్పందన బాగుందని ఆయన చెప్పారు. ఈ విభాగంలో అత్యధికంగా బంధన్ బ్యాంక్ 4,473 కోట్ల రూపాయలు ఆర్జించింది. అపోలో మైక్రోసిస్టమ్స్ 176 సార్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్ 115 సార్లు, ఆర్‌ఐటీఈఎస్ 67 సార్లు, హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్ మేనేజ్‌మెంట్ 60 సార్లు, గెలాక్సీ సర్‌ఫాక్టంట్స్ 14 సార్లు, బంధన్ బ్యాంకు 11 సార్లు వంతున సబ్‌స్రైబ్ అయ్యాయి.
సంవత్సర ద్వితీయార్థంలో
తగ్గిన ఐపీఓల ట్రేడింగ్
ఈ సంవత్సరం ద్వితీయార్థంలో 24ప్రాథమిక పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓ)ల్లో 15 దిద్దుబాటుకు గురై ప్రస్తుతం ఇస్యూ విలువకన్నా తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. రాబోయే నూతన సంవత్సరంలోనూ ప్రథమార్థం వరకూ ఈ విషయంలో ఎక్కువ సానుకూలత ఉండే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో 59 కంపెనీలు ఇప్పటికే రూ.63,170 కోట్ల ఐపీఓలకు సెబీ నుంచి ఆమోదం పొందాయి. మరో 19 కంపెనీలు సైతం సెబీ అనుమతి వచ్చిన వెంటనే ఈ విభాగంలో సుమారు 18,067 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ఆశిస్తున్నాయి.
ఓఎఫ్‌ఎస్‌ల ద్వారా
నిధుల సమీకరణ తగ్గుదల
ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)ల ద్వారా ఈ యేడాది నిధుల సమీకరణ గణనీయంగా తగ్గింది. గత యేడాది ఈ పథకం ద్వారా 18.067 కోట్ల రూపాయలు సమకూరగా, ఈ యేడాది ఇప్పటి వరకు కేవలం 10,678 కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించడం జరిగింది. ఈ విభాగంలో కోల్ ఇండియా అక్టోబర్‌లో 5,274 కోట్ల రూపాయలు కూడగట్టి అగ్రభాగాన నిలిచింది. లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ 1,846 కోట్లతో రెండో స్ధానంలో నిలిచింది. ఈ విభాగంలో మొత్తం 25 కంపెనీలు 16,677 కోట్ల రూపాయలు ‘క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా సమకోవడం జరిగింది. అయితే ఈ పథకం ద్వారా గత యేడాది 61,148 కోట్ల మొత్తం సమకూరగా ఈ యేడాది 73 శాతం తగ్గిపోవడం గమనార్హం. ఈ విభాగంలో అధికంగా నిధులు సమకూర్చుకున్న సంస్థగా ఇండియా సెల్యూలార్ 3,500 కోట్లతో అగ్రస్థానం ఆక్రమించింది.