బిజినెస్

ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో రూ. 28,615 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ద్రవ్యలోటును ఎదుర్కొంటున్న ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 28,615 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రీ కేపిటలైజేషన్ బాండ్లు ద్వారా ఈ నిధులను కేంద్రం సమకూర్చనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం నాడిక్కడ వెల్లడించాయి. అవసరాలకు అనుగుణంగా మూలధనాన్ని సమకూర్చుకుని పనితీరును మెరుగుపరచుకునేందుకు ఈ ఆర్థిక సాయం తోడ్పడుతుంది. ఈనెల 31లోగా ఈ నిధుల విడుదల జరిగే అవకాశాలున్నాయంటున్నారు. కేంద్ర నిధులు పొందనున్న ఏడు బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అత్యధికంగా 10,086 కోట్ల రూపాయలు అందే అవకాశాలున్నాయి. రెండో అత్యధిక నిధులు రూ. 5.500 కోట్లు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు అందనున్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్టక్రు రూ. 4,498 కోట్లు, యూకో బ్యాంకుకు 3,056 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2,159 కోట్లు వంతున రీకేపిటలైజేషన్ బాండ్ల ద్వారా కేంద్ర నిధులు అందనున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 65 వేల కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పటికే 23వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. ఇంకా 42వేల కోట్ల నిధులివ్వాల్సివుంది. కాగా గతంలో ప్రకటించిన నిధులకు అదనంగా మరో 41వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం అందజేస్తుందని ఈ నెలారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనను పార్లమెంటులో ఈనెల 20న ప్రవేశపెట్టడం జరిగింది. రిజర్వు బ్యాంకు ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నిబంధనల నుంచి బయటపడి బ్యాంకులు పనిచేసేందుకు ఈ అదనపునిధులు బ్యాంకులకు వెన్నుదన్నుగా ఉంటాయని మంత్రి జైట్లీ చెప్పారు. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11 బ్యాంకులు రిజర్వు బ్యాంకు పీసీఏ నిబంధనల పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఈ బ్యాంకులపై పీసీఏ పేరిట రిజర్వు బ్యాంకు అర్థంలేని ఆంక్షలు విధిస్తోందన్నది జైట్లీ వాదన. పీసీఏ నిబంధనల పరిధిలో అలహాబాద్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకు, యూకోబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి.