బిజినెస్

రెండోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 27: వరుసగా రెండోరోజూ బీస్‌ఈ బెంచ్ మార్కులో సెనె్సక్స్ లాభాల బాటలో నడిచింది. గురువారం మొత్తం 157 పాయింట్లు లాభపడింది. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. రోజు ప్రారంభంలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ర్యాలీ జోరు కొనసాగింది. సుమారు 400 పాయింట్ల వరకు ఎగబాకిన అనంతరం మళ్లీ తిరోగమనంలో నడిచి 157.34 పాయింట్లు అదనంగా 0.44 శాతం లాభాలతో 35,807.28 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 49.95 పాయింట్లు ఎగబాకి 0.47 శాతం లాభాలతో 10,779.80 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ అత్యధిక లాభాలు గడించాయి. సుమారు రెండు శాతం అదనపు లాభాలను ఈ కంపెనీలు ఆర్జించాయి. అయితే మరోవైపు హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, స్టీల్స్, మారుతీ సుజుకీ కంపెనీలు సుమారు రెండు శాతం నష్టాలను చవిచూశాయి. అమెరికన్ ఫెడరేషన్, వైట్ హౌస్‌కు మధ్య విభేదాలు తగ్గుముఖం పట్టడం అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్‌పై సానుకూల పరిణామం చూపిందని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్ బలపడి స్వల్పలాభాలను చేకూర్చిందని అంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీ కేపిటలైజేషన్ బాండ్ల ద్వారా 28,615 కోట్ల నిధులు కేంద్రం సమకూరుస్తుందన్న వార్తల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయని అంటున్నారు.
తగ్గిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి విలు వ గురువారం 0.27 శాతం తగ్గింది. మొత్తం విలు వ 70.28 రూపాయలకు చేరింది. అలాగే ముడిచమురు ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 3.78 శాతం తగ్గి బ్యారల్ ధర 53.20 డాలర్లు పలికింది. కాగా గురువారం విదేశీ ఇనె్వస్టర్లు 80.28 కోట్ల రూపాయలను భారత మార్కెట్లో మదుపు చేయగా, దేశీయ 137.63 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మకాలు జరిపారు.