బిజినెస్

పెరిగిన మొండి బకాయిల వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: దివాళా తీసిన సంస్థల నుంచి బ్యాంకులకు అందాల్సిన రుణాల వసూళ్లలో గడచిన ఆర్థిక సంవత్సరం పెరుగుదల కనిపించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రఫ్ట్ కోడ్ (ఐబీసీ)ని వినియోగించడం అద్భుతంగా పనిచేసింది. అలాగే ఆర్థిక పరమైన ఆస్తులకు సంబంధించి ‘సెక్యూరిటైజేషన్ అండ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసర్ట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్స్ (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ) చట్టానికి సవరణలు చేయడం కూడా రుణాల రికవరీకి బాగా తోడ్పడిందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ గణాంకాల మేరకు 2018 మార్చి నాటికి బ్యాంకులు మొత్తం 40 వేల కోట్ల రూపాయల విలువైన మొండి బకాయిలను వసూలు చేయడం జరిగింది. 2017లో ఇదే కాలానికి 38,500 కోట్ల రుణ వసూళ్లతో పోలిస్తే ఇది స్వల్పంగా అధికమే. మొండి బకాయిల వసూళ్లకు బ్యాంకర్లు వివిధ పద్ధతులు వినియోగించారు. పై రెండు చట్టాలను ప్రయోగించడంతోబాటు అప్పుల వసూళ్ల ట్రిబ్యునళ్లు (డీఆర్టీలు), లోక్‌అదాలత్‌లను కూడా బ్యాంకర్లు ఆశ్రయించడం జరిగింది. కాగా బ్యాంకులను మోసగించడం, దివాళా పేరిట రుణ ఎగవేతలను నియంత్రించే కోడ్ (ఐబీసీ)ని వినియోగించడం ద్వారా ఈ యేడాది రూ.4.900 కోట్ల మొండి బకాయిలు వసూలైనట్లు రిజర్వు గణాంకాలు తెలుపుతున్నాయి. అలాగే మొండి బకాయిలున్న సంస్థల ఆస్తులకు భద్రత, పునరుద్ధరణ, వడ్డీల వసూలు ఎన్‌ఫోర్సుమెంట్ చట్టం (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ)ని అమలు చేయడం ద్వారా రూ. 26,500 కోట్లు 2018 ఆర్థిక సంవత్సరంలో రికవరీ అయ్యాయని 2017-18 ఆర్థిక సంవత్సర స్థితిగతులు, ఆర్థికాభివృద్ధిపై విడుదలైన రిజర్వుబ్యాంకు నివేదిక తెలిపింది. కాగా రుణ వసూళ్లను మరింత శీఘ్రతరం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ‘ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ’ చట్టాన్ని సవరించడం వల్ల ఆస్తులు తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పక్షంలో నెల రోజుల్లోగా సంబంధిత యజమాని తన ఆస్తుల వివరాలను బ్యాంకులకు అందజేసి వాటి స్వాధీనానికి తోడ్పడాల్సివుంది. అలాకాని పక్షంలో రుణ బకాయిదారునికి మూడు నెలల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇది రుణ వసూళ్లు పెరిగేందుకు తోడ్పడిందని అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు లోక్ అదాలత్‌లు, డీఆర్‌టీ (టిబ్యునళ్లు) ద్వారా జరిగే వసూళ్ల శాతం మాత్రం తగ్గుముఖం పట్టింది. కాగా ఐబీసీ మెకానిజంను వినియోగించడం ద్వారా ఇతర వాటికన్నా అధికంగా మొండి బకాయిలు వసూలయ్యాయని తెలిపారు. మున్ముందు కూడా దీనివల్ల ప్రయోజనం చేకూరిందని నివేదిక వెల్లడించింది. మున్ముందు కూడా దీనివల్ల ప్రయోజనం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే బకాయిలున్న కంపెనీలు లేదా సంస్థల ఆస్తులు విక్రయించడం లేదా ఆస్తుల పునరుద్ధరణ (ఏఆర్‌సీలు) ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణ బకాయి జాబితాలను తగ్గించుకున్నాయని రిజర్వుబ్యాంకు తెలిపింది. కాగా 2017-18లో ఆస్తుల పునర్మాణ కంపెనీల పథకం (ఏఆర్‌సీల) ద్వారా సేకరించిన ఆస్తుల పద్దు విలువ బాగా పెరిగింది. ఆస్తుల అమ్మకాల ద్వారా బ్యాంకు రుణ వసూళ్లు భవిష్యత్తులోనూ పెరుగుతాయని నివేదిక తెలిపింది.