బిజినెస్

ఏడాది కనిష్టానికి పెట్రోలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పెట్రోలు ధర ఆదివారం 22 పైసలు తగ్గింది. దీంతో లీటరు ధర యేడాది కనిష్టానికి చేరింది. అలాగే డీజిల్ ధర సైతం 23 పైసలు తగ్గి లీటరు ధర తొమ్మిది నెలల కనిష్టానికి చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 69.26 నుంచి 69.04కు తగ్గింది. ఇక డీజిల్ ధర రూ. 63.32 నుంచి 63.09కి తగ్గింది. ఈమేరకు చమురు సంస్ధలు ఆదివారం నాడిక్కడ ప్రకటన విడుదల చేశాయి. కాగా గడచిన అక్టోబర్ నుంచి ఇలా పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ యేడా ది కనిష్ట స్థాయికి పెట్రోలు ధరలు చేరుకున్నాయి. అలాగే తొమ్మిది నెలల కనిష్టానికి డీజిల్ ధరలు దిగివచ్చాయి. అక్టోబర్ నెల నుంచి ఇలా చమురు ధరలు మొత్తం లీటరుకు రూజ13.79 తగ్గుముఖం పట్టా యి. గత ఆగస్టు నెల రెండో పక్షం నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండున్నర నెలలపాటు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వా త రెం డున్నర నెలల కాలంగా లీటరు మీద 12.06 రూపాయలు తగ్గిపోవడం గమనార్హం. ప్రత్యేకించి అక్టోబర్ 4న పెట్రో ధరలు రికార్డు అధిక స్థాయికి పెరిగాయి. ఆరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ. 84, ముంబయిలో రూ.91.32 పలికింది. అలాగే ఆ రోజు డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.75.45, ముంబయిలో రూ.80.10ల అత్యధిక మొత్తానికి చేరి దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున చర్చకు దారితీసింది. అంతకు ముం దు ఆగస్టు 16 నుంచి పెట్రో ధరల పెరుగుదల ప్రారంభంకాగా అక్టోబర్ 17 వర కు పెట్రో ధరలు పెరిగాయి. అయితే అ ప్పటి నుంచి తిరిగి అంతర్జాతీయ మార్కె ట్లో ముడి చము రు ధరలు పెరగడం, రూ పాయి విలువ పెరగడంతో క్రమంగా పెట్రో ధరలు అదుపులోకి వచ్చాయి. గడచిన రెండున్నర మాసా ల్లో ఒక్క డిసెంబర్ 18న మాత్రమే పెట్రో ధరలు 10పైసలు పెరగగా, డీజిల్ ధరలు డిసెంబర్ 17న 9పైసలు, 18 7పైసలు వంతున పెరిగాయి. కాగా సమీప రోజుల్లో పెట్రో రీటైల్ ధరలు వినియోగదారులకు మరింత సులభ సాధ్యంగా మారే అవకాలున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.