బిజినెస్

రికార్డు స్థాయి ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను విక్రయించడం ద్వారా గడచిన యేడాది కేంద్ర ప్రభుత్వం 77.417 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఇదే రకమైన పెట్టుబడులను వెనక్కు తీసుకునే (డిసినె్వస్ట్‌మెంట్) కార్యక్రమం కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రణాళికాబద్ధంగా ప్రైవేటీకరించడం ద్వారా పెట్టుబడి డిసినె్వస్ట్‌మెంట్ ప్రణాళికను ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నారు. గతంలో పాలించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూలేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటీకరించింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం సైతం ప్రభుత్వానికి భారంగా మారిన మరికొన్ని సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రణాళికలతో ముందుకెళుతోంది. ఐతే ఇందులోప్రస్తుత మోదీ ప్రభుత్వం ఈ విధానంలో సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఇందులోప్రధానమైంది కంపెనీలు లేదా సంస్ధలను విలీనం చేయడం ద్వారా ఆదాయ లక్ష్యాలు సాధించడం. ఇందులో అతిపెద్ద పెట్టుబడులు కలిగిన ఓఎన్‌జీసీలో హెచ్‌పీసీఎల్‌కు భాగస్వామ్యం కల్పించడం, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్, భారత్-22 ఈటీఎఫ్‌ల కలయిక, కోల్ ఇండియా వాటాల విక్రయంతోబాటు ఆరు పబ్లిక్ ఇనిషియల్ ఆఫరింగ్స్ (ఐపీఓ) ద్వారా 77,417 కోట్ల రూపాయల ఆదాయాన్ని గత యేడాది ప్రభుత్వం సమీకరించింది. అలాగే ఎయిర్ ఇండియాలోని 74 శాతం వాటాలను విక్రయించాలన్న అతిపెద్ద నిర్ణయాన్ని అమలు చేయడం ఆరంభించింది. ఈక్రమంలో ఎయిరిండియా వాటాల విక్రయానికి సరికొత్త ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్), ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) వంటి అనుబంధ విభాగాలతోబాటు, ఎయిర్ ఇండియాకు చెందిన భూములు, ఇతర ఆస్తులను సైతం ప్రత్యేకంగా అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. తద్వారా 29 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఎయిర్ ఇండియాకు తగ్గించాలన్న సదాశయంతోప్రభుత్వం ముందుకెళుతోంది. అప్పటి వరకు ప్రభుత్వం ఎయిరిండియాకు నిధులు సమకూరుస్తూ ఈ సంస్థ నిలదొక్కుకునేందుకు దోహదం చేయాలని నిర్ణయించింది. నిరర్ధక ఆస్తులను విక్రయించి రాబాడికి అనువుగా ఉండే విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థ ఆర్థిక దృఢత్వానికి తోడ్పడవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. ఎయిర్ ఇండియా అనుబంధ ఆస్తులు, ఇతరత్రా భూములు, భవనాల విక్రయాల ద్వారా తొమ్మిది వేల కోట్లు సమకూరుతాయని ఆ సంస్థ అంచనావేస్తోంది. ఈక్రమంలో నూతన సంవత్సరంలో ఈ సంస్థకు చెందిన విక్రయ ప్రణాళికల్లో తొలుత ప్రభుత్వం 51 శాతం వాటాలు కలిగివున్న హెలికాప్టర్ సేవా విభాగం ‘పవన్ హాన్స్’ విక్రయ ప్రక్రియ ఆరంభమైంది. అలాగే ఓఎన్‌జీసీలో కూడా ప్రభుత్వం అధిక వాటాలు కలిగివుంది. పవన్ హాన్స్ విక్రయ ప్రక్రియ ఈ యేడాది మార్చి నాటికి పూర్తి చేయాల్సివుంది. అలాగే సుమారు 10 సీపీఎస్‌ఈల వాటాల బైబ్యాక్‌కు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఓన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా, ఎన్‌సీఎల్, బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఏఎల్‌సీఓ ఉన్నాయి. ఈ బైబ్యాక్ ద్వారా సుమారు 12వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈ) విలీనం, సమీకరణ కార్యక్రమాలు ఈ యేడాది ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశాలున్నాయి. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)లో సైతం ప్రభుత్వ వాటాలను రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ నుంచి సుమారు 15 వేల కోట్ల మేర ఉపసంహరించుకోనుంది. అలాగే ‘విలీనం, సమీకరణ’ (ఎం అండ్ ఏ) కార్యక్రమం డీల్ సైతం ఎన్‌టీపీసీలో అమలు చేయాలని, ఎస్‌జేవీఎన్‌లోని ఆరు వేల కోట్ల వాటాలను తిరిగి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళికలను గత యేడాది జనవరిలో జరిగిన ఓఎన్‌జీసీ-హెచ్‌పీసీఎల్ డీల్ తరహాలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. హెచ్‌పీసీఎల్‌లోని మొత్తం 15.11 శాతం వాటాలు 36,915 కోట్లను ఓఎన్‌జీసీ అప్పట్లో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ నుంచి ఆరంభం కానున్న ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే ‘డిసినె్వస్ట్‌మెంట్ ప్లాన్’కు సంబంధించిన బడ్జెట్ లక్ష్యాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఓన్‌జీసీ-హెచ్‌పీఎల్ డీల్ అనుభవాలతో పెట్టులను వెనక్కు తీసుకునే ప్రణాళిక ద్వారా నిధుల సమీకరణల్లో లక్ష కోట్ల రూపాయల మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఇలా 72,500 కోట్ల రూపాయలు సమీకరించగా కొత్త సంవత్సరం 2019 మార్చి నాటికి ఈ మొత్తం 80 వేల కోట్లకు చేరాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుంది. రైల్వే శాఖలోని రెండు సీపీఎస్‌ఈలు ఆర్‌ఐటీఈఎస్, ఐఆర్‌సీఓఎన్ విభాగాల ఐపీఓల ద్వారా గడచిన యేడాది స్టాక్ మార్కెట్లోకి చేరగా, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మిశ్రాధాతు నిగమ్, గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థలు సైతం ఇప్పటికే స్టాక్ ఎక్చేజీల్లోకి అడుగుపెట్టాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లకు అంత ఆశాజనకంగా లేదు.