బిజినెస్

29శాతం వృద్ధి రేటు సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 1: విశాఖ ఉక్కు కార్మాగారం గణనీయమైన ప్రగతి దిశగా నడుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,687 కోట్ల టర్నోవర్ సాధించి 29 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఉక్కు టర్నోవర్ రూ.11,395 కోట్లు. ఉక్కు విక్రయాల్లో కూడా కర్మాగారం ఇదే ప్రగతి కనబరచింది. గతేడాది వృద్ధి రేటుతో కంటే 8 శాతం మెరుగుపరచుకుందని సీఎండీ పీకే రథ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ హాట్ మెటల్ ఉత్పత్తిలో 18 శాతం, ద్రవ ఉక్కు ఉత్పత్తిలో 16 శాతం, సేలబుల్ స్టీల్‌లో 15 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకున్నట్టు ప్రకటించారు. ఉక్కు నిర్వహణలో కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 20శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్య పెంపు తో లక్ష్యాలు అందిపుచ్చుకుంటున్నట్టు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ముడి సరుకుల నిర్వహణలో సామర్థ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామన్నారు. హాట్ మెటర్ ఉత్పత్తిలో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉపయోగించే పల్వరైజ్డ్ కోల్ ఇంజక్షన్ (పీసీఐ)ను మెరుగుపరచుకోవడం ద్వారా వృధా వ్యయాన్ని గణనీయంగా నియంత్రించుకోగలిగామన్నారు. ఒక టన్ను ముడి సరుకుతో 100కిలోల ఉక్కు ఉత్పత్తి సాధించడం ద్వారా దాదాపు రూ.1,500 కోట్లు ఆదా చేయగలిగామన్నారు. నాలుగవ త్రైమాసికంలో మరింగా పనితీరు మెరుగుపరచుకుని బ్లాస్ట్ఫ్‌ర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్ ద్వారా మంచి ఫలితాలు రాబడతారని ఆశాభావం వ్యక్తం చేశా రు. సిబ్బంది, అధికారుల సామర్థ్యం, అంకితభావంతోనే విశాఖ ఉక్కు అనేక సవాళ్లను ఎ దుర్కొని మంచి ఫలితాలు సాధించారన్నారు. అంతకు ముందు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో 2019 డైరీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ (కమర్షియల్) రాయ్ చౌదురి, డైరెక్టర్ (పర్సనల్) కేసీ దాస్, డైరెక్టర్ (ఫైనాన్స్) వీవీ వేణుగోపాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ అసోసియేట్స్, యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..డైరీని ఆవిష్కరిస్తున్న స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్