బిజినెస్

పెరుగుతున్న ఆర్డర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 2: గత రెండు సంవత్సరాలుగా పైపులైన్ల ఏర్పాటుకు సంబంధించి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తుండటంతో నిర్మాణరంగం స్థిరంగా, ఆశాజనకంగా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రంగానికి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తుండటంతో ఈ రంగం స్థిరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్మాణరంగంలో పెద్దయెత్తున ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా పైపులైన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్డర్లు నిర్మాణ రంగ సంస్థలకు ఊతం ఇస్తున్నాయి. దీనిద్వారా వాటి ఆదాయం కూడా ఆశాజనకంగానే ఉంది. ముఖ్యంగా రైల్వేస్, పోర్టు, పట్టణ అభివృద్ధి సంస్థలు, ఎయిర్‌పోర్టులకు సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయి. వీటి నిర్మాణం, పునర్నిర్మాణానికి సంబంధించిన పనుల వల్ల ఆయా కంపెనీలో చేతిలో ఆర్డర్లు బాగానే ఉంటున్నాయని ఇక్రా బుధవారం వెల్లడించింది. ఇదేవిధంగా రోడ్‌ల నిర్మాణం, పైపులైన్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ఏర్పాటు కూడా పెద్దయెత్తున జరుగుతున్నాయి. భరతమాల పరియోజన ప్రాజెక్టు కింద పెద్దయెత్తున చేపడుతున్న పనుల వల్ల నిర్మాణరంగానికి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఈ పథకం కింద 5.36 ట్రిలియన్ల రూపాయలను ప్రభుత్వం పెట్టుబడిగా పెడుతోంది. దానికి తోడు పలుచోట్ల పైపులైన్ ప్రాజెక్టులు సైతం పెద్దయెత్తున జరుగుతుండటంతో నిర్మాణ సంస్థలకు, వాటి సబ్సిడరీ కంపెనీలకు చేతినిండా పని తగులుతోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అభివృద్ధి పనుల వేగం కొంత తగ్గుముఖం పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొంత అస్థిర, అనిశ్చితి పరిస్థితులు ఏర్పడతాయని, ఎన్నికల ప్రక్రియ జరిగి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు అభివృద్ధి పనులు పుంజుకోవని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తాము చేపడుతున్న పనులు కొనసాగుతూ ఉంటాయని, అయితే ఎన్నికలు జరిగే ఒకటి రెండు నెలలు బిల్లుల చెల్లింపు, ఇతర సాంకేతిక అంశాల కారణంగా పనులు మందగిస్తాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.