బిజినెస్

రుణ విధానంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 2: రిజర్వు బ్యాంకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చే వారం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సంస్ధలు (ఎంఎస్‌ఎంఈ), నాన్ బ్యాంకింగ్ రంగంలోని ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఏక దఫా రుణ పునర్వ్యవస్థీకరణ (వన్ టైం లోన్ రీస్ట్రక్చరింగ్) పథకాన్ని రిజర్వు బ్యాంకు మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఆ బ్యాంకు గవర్నర్ దాస్ ఇలా తనభేటీ విషయాన్ని ట్వీట్ చేశారు. ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో వచ్చేవారం తాను భేటీ కానున్నట్టు గవర్నర్ దాస్ వెల్లడించారు. గత నవంబర్ 19న ఆర్బీఐ బోర్డు కీలక సమావేశం నిర్వహించి అనేక క్లిష్టతర విషయాలపై కూలంకషంగా చర్చింది. మొండి బకాయిలున్న ఎంఎస్‌ఎఈ లబ్ధిదారుల ఆస్తులు, అప్పుల పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ సంబంధింత సంస్థలు మళ్లీ ఆర్థికంగా పుంజుకునే పరిస్థితులుంటే రూ.25 కోట్ల వరకు రుణాలను ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బోర్డు సూచించిన సంగతి తెలిసిందే. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో, హౌసింగ్ పైనాన్స్ కంపెనీల్లో ఏర్పడిన ద్రవ్యలోటు సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సైతం సూచించడం జరిగింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలోని ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన క్రమంలో రిజర్వు బ్యాంకు ప్రభుత్వానికి ఈ కొత్త ప్రతిపానలు చేసింది. అయితే ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీలోని వివిధను ఆస్తుల మానిటరైజ్ చేయడం ద్వారా రుణాల చెల్లింపునకు చర్యలు చేపట్టిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రకటన ఆ సంస్ధను ఆశ్చర్యానికి గురి చేసింది.