బిజినెస్

విస్తరణకు రూ.770 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: గిర్‌నార్ సాఫ్ట్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ పోర్టల్ ‘కార్ దేఖో’ కంపెనీ విస్తరణకు రూ.770 కోట్లు (110 మిలియన్ డాలర్లు) నిధులు సమీకరించింది. మూలధనంలో సిరీస్-సీ ఫండింగ్ విధానం ద్వారా వివిధ రకాల పెట్టుబడిదారుల నుంచి ఈ నిధుల సమీకరణ జరిగిందని కంపెనీ గురువారం నాడిక్కడ వెల్లడించింది. సీక్వోయా ఇండియా, హిల్‌హౌస్, కేపిటల్ జి (ఆల్ఫాబేట్ గ్రోత్ ఇనె్వస్ట్‌మెంట్ ఆర్మ్), యాక్సిస్ బ్యాంక్ ఇందులో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఈ నిధులను కార్ల వ్యాపార విస్తరణకు, ఇన్సూరెన్స్, ఆర్థిక విభాగాలకు వెచ్చించాలని నిర్ణయించినట్టు వివరించింది. ఈ విభాగాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా వీటిని పెద్దయెత్తున విస్తరించాలని కంపెనీ నిర్ణయించిందని కార్‌దేఖో సీఈవో, వ్యవస్థాపకుడు అమిత్ జైన్ తెలిపారు. తాజాగా సమీకరించిన నిధులతోబాటు కంపెనీ నిధుల మొత్తం 185 మిలియన్ డాలర్లకు చేరిందన్నారు. కార్లు, మోటార్ సైకిళ్ల తయారీలో ఎనిమిదికి పైగా కంపెనీలతో తమ కంపెనీ కలిసి పనిచేస్తోందని, ఆ కంపెనీ ఉత్పత్తుల విక్రయాల్లో సైతం 15-30 శాతం వార్షిక భాగస్వామ్యం కలిగివున్నామని, దేశ వ్యాప్తంగా ఐదు వేల డీలర్షిప్‌లతో కలిసి పనిచేస్తున్నట్టు వివరించారు. అంతేగాక వాడిన కార్లకు సంబంధించి పదికి పైగా ఫైనాన్స్ కంపెనీలతో అనుబంధంగా పనిచేస్తున్నామని అమిత్‌జైన్ తెలిపారు. రుణ సదుపాయంతోబాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సమకూర్చేందుకు తోడ్పడుతున్నామన్నారు. కాగా గత యేడాది ప్రథమార్థంలో ఈ కంపెనీలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్‌టాటా సైతం వాటాదురు అయ్యారు.