బిజినెస్

బ్యాంకుల లావాదేవీలకు ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకుల లావాదేవీలకు పాక్షికంగా ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంఘాల ప్రభావం రోజువారీ విధులపై పడింది. ఐతే మిగతా సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తోబాటు ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. కాగా సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్ వంటి కౌంటర్ లావాదేవీలకు అనేక బ్యాంకుల్లో ఆటంకం కలిగింది. ఐతే అధికారులు మాత్రం అన్ని బ్యాంకుల్లో విధుల్లో పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత డిసెంబర్ 26న తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఒక రోజు సమ్మె జరిగిన సంగతి తెలిసిందే.
అలాగే అఖిల భాతర బ్యాంకు అధికారుల కాన్ఫిడరేషన్ (ఏఐబీఓసీ) సైతం డిసెంబర్ 21న ఒక రోజు సమ్మె చేపట్టడం జరిగింది. ఇలావుండగా ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇందువల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఉపాధి కోల్పోవడంతోబాటు, భవిష్యత్తులో కూడా ఉద్యోగావశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐడీబీఐ వంటి వాటిని ప్రైవేటీకరించాలన్న ఆలోచన సరైందికాదని అన్నారు. కాగా బుధవారం కూడా సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో జరిగే అసౌకర్యంపై ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగిందన్నారు.