బిజినెస్

తగ్గనున్న పత్తి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మార్కెట్‌లో పత్తి ధర తగ్గుతోందని, అందువల్ల రైతులకు ఇబ్బంది లేకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించేలా మార్కెటింగ్, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), మార్క్‌ఫెడ్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి సీసీఐ ఇప్పటి వరకు 731 కోట్ల రూపాయల విలువ చేసే 1,34,805 టన్నుల పత్తిని 54,512 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్టు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి తెలిపారు. పత్తి ధరలు తగ్గుతున్నందు వల్ల జిల్లా కలెక్టర్లు గుర్తించిన 202 జిన్నింగ్ మిల్లులతో పాటు 27 మార్కెట్ యార్డుల నుండి పత్తికొనుగోలును వేగంగా కొనసాగించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. పత్తికొన్న వెంటనే రైతులకు డబ్బు చెల్లించాలని ఆదేశించారు. గజ్వేల్‌లో పత్తికొనుగోలు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఆరోపణతో వెంటనే సదరు అధికారిని మార్చాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో సంబంధిత అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని ఆమె ఆదేశించారు. రైతుల నుండి కందులను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ప్రారంభించిన 19 కేంద్రాలతో పాటు మరో 127 కొనుగోలు కేంద్రాలను బుధవారం నుండే ప్రారంభించాలని లక్ష్మీబాయి ఆదేశించారు. మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి. భాస్కరాచారి, మార్కెటింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.