బిజినెస్

సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జనవరి 10: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను 500 క్లస్టర్ గ్రామాలను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ గురువారం నాడిక్కడ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని ‘బ్రాండ్ గోవా’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అమెరికాలోని ‘హోల్ ఫుడ్’ విధానాన్ని అనుసరించి ఆ పద్ధతులతో సేంద్రీయ సాగుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నామని, దీనికోసం ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించామని సర్దేశాయ్ తెలిపారు. ప్రస్తుతం ఈ రకమైన సేంద్రీయ సాగుకు మనదేశంలో రైతులకు అధిక మొత్తం ఖర్చవుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సాగు ఖర్చును తగ్గించి రైతుకు అందుబాటులోకి తేవడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కంపెనీతో ఎంవోయూ పూర్తయిన తర్వాత స్థానికంగా ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ’ పేరిట ఓ సేంద్రీయ వ్యవసాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వ్యవసాయంపై ఏర్పాటైన సెమినార్‌లో మాట్లాడుతూ మంత్రి సర్దేశాయ్ తెలియజేశారు. రెండు రోజుల క్రితమే ఈ సాగుకు సంబంధించిన ప్రత్యేక 500 క్లస్టర్ల ఎంపిక పూర్తి చేసినట్టు తెలిపారు. ఐక్య రాజ్యసమితి ఇచ్చిన సుస్థిర అభివృద్ధి నినాదాన్ని అందుకుని రాష్ట్రం ముందడుగేస్తోందని, ఈ లక్ష్యాన్ని ‘బ్రాండ్ గోవా’ తో అందుకోదలిచామని, ఇప్పటికే గోవా గుట్కా పేరిట ఓ బ్రాండ్ ఇమేజ్ పడిందని, వాస్తవానికి ఆ గుట్కాకు సంబంధించిన యజమాని గోవాలో లేదని, ఇక్కడ ఆ గుట్కా వాడకమూ లేదని ఆయన గుర్తు చేశారు. ఐతే వ్యవసాయానికి సంబంధించి అలాంటి బ్రాండ్ ఇమేజ్ రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.