బిజినెస్

ఆచితూచి అడుగు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: గత వారం గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగినప్పటికీ, చివరికి 0.2 శాతం లాభాలతో ముగిసింది. అయితే, ట్రేడింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను విశే్లషించి, కొత్త వారంలో ప్రపంచ మార్కెట్ ఆచితూచి అడుగు వేయనుంది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ఇంకా తెరపడలేదు. ఇరు దేశాలకు చెందిన ప్రతినిథుల సమావేశం వివరాలుగానీ, తీసుకున్న నిర్ణయాలుగానీ ఇంకా బహిర్గతం కాలేదు. ఏఏ అంశాలపై ఒప్పందాలు కుదిరాయన్నది కూడా అంతర్జాతీయ మార్కెట్ వర్గాలకు తెలియరాలేదు. ఫలితంగా అమెరికా మార్కెట్ ధోరణులపైనే గ్లోబల్ మార్కెట్ ఎక్కువగా ఆధారపడింది. తదుపరి పరిస్థితులు, వివిధ రంగాల నుంచి అందే సూచీలు ఏ విధంగా ఉంటాయోనని వేచి చూస్తున్నామని, అందుకే, ప్రస్తుతం ఎలాంటి తొందరపాటు లేకుండా ఆచితూచి ట్రేడింగ్ చేస్తామని రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ అధ్యక్షుడు జయంత్ మాంగ్లిక్ స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, సోమవారం స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు మొదలైన క్షణం నుంచి చివరి ధవ వరకూ మదుపరులు అన్ని అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ, ట్రేడింగ్‌ను కొనసాగించనున్నారు. బ్రోకర్లు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటారు కాబట్టి, వారంలో మొదటి రోజు అద్భుతాలను ఆశించడానికి వీల్లేదు. గ్లోబల్ మార్కెట్ ప్రభావం మిగతా దేశాలతోపాటు భారత్ స్టాక్ మార్కెట్‌పైనా ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ట్రేడింగ్ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశే్న.