బిజినెస్

మరింత బొగ్గు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 13: విద్యుత్ ఉత్పత్తిలో నిర్ధారిత లక్ష్యాలను చేరుకోవాలంటే, మరింత బొగ్గు అవసరమవుతుందని, ప్రస్తుతం ఉన్న లోటును భర్తీ చేసే విధంగా సరఫరా చేయాలని నేషనల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్)ను ఎన్‌టీపీసీ కోరుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్‌దీప్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రాంతీయ అవసరాల కోసం సరళీకృత బొగ్గు వినియోగం పథకం కింద ఎక్కువ మొత్తంలో బొగ్గును సరఫరా చేయాలని ఆయన ఆదివారం విడుదల చేసి న ఒక ప్రకటనలో ఎన్‌సీఎల్‌ను కోరారు. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాంచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌టీపీఎస్)కు బొగ్గును సరఫరా చ్తేన్న నిగాహీ కోల్ మైన్‌ను ఆయన ఇటీవల సందర్శించారు. ఆ బొగ్గు గని నిర్వాహణ బాధ్యత లు చూస్తున్న ఎన్‌సీఎల్‌ను ఫ్లెక్సీ యుటిలైజేషన్ పథకం కింద సరఫరాను పెంచాలని ఆయన కోరారు. దేశంలోనే అత్యధిక మొత్తంలో విద్యుత్‌ను సరఫరా చేయగల సామర్థ్యం వౌదా థర్మల్ పవర్ స్టేషన్ (ఎంటీపీఎస్)కు ఉంది. ఎన్‌టీపీసీ పర్యవేక్షణలోని ఈ థర్మల్ ప్లాంట్ పూర్తి సామ ర్థ్యం 2,320 మెగావాట్స్‌కాగా, ప్రస్తుతం అందులో సుమారు సగం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది. ఇది పూర్తి సామర్థ్యంతో పని చేసి, లక్ష్యాల మేరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే, అధిక మొత్తంలో బొగ్గు అవసరమవుతుంది. దేశీయ అవసరాలకు ఉద్దేశించింది కాబట్టి, ఎంటీపీఎస్‌కు బొగ్గు సరఫరాను పెంచాలని ఎన్‌టీపీసీ కోరుతున్నది. దీనిపై ఎన్‌సీఎల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.