బిజినెస్

ఫోరెక్స్‌లో ఆర్‌బీఐ జోక్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడో లేక తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నమో తెలియదుగానీ, ఫోరెక్స్ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం పెరిగిపోయింది. ఒక ఏడాది కాలంలో కొనుగోలు చేసిన డాలర్ల కంటే అమ్మిన డాలర్ల విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటి అమ్మకాలు జరిగిన సంస్థ లేదా వ్యక్తిని నెట్ సెల్లర్ అంటారు. ఫోరెక్స్ మార్కెట్‌లో నెట్ సెల్లర్స్ జాబితాను పరిశీలిస్తే, గత ఏడాది చివరిలో భారత్ నెంబర్ వన్ స్థానంలో దర్శనమిస్తుంది. గత ఏడాది నవంబర్ మాసంలో ఆర్‌బీఐ 644 మిలియన్ డాలర్లను నెట్ మార్కెట్‌లో అమ్మింది. తాజా నివేదికను అనుసరించి ఆర్‌బీఐ 3.127 బిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొనుగోలు చేసింది. 3.771 డాలర్లను అమ్మింది. రూపాయి మారకపు విలువ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మారకం రేటు కొంత మెరుగు పడిన వెంటనే, డాలర్ల అమ్మకానికి ఆర్‌బీఐ తెరతీస్తున్నది. ఫోరెక్స్ మార్కెట్‌ను ఈ జోక్యమే అతలాకులం చేస్తున్నది. ప్రైవేటు సంస్థలుగానీ, వ్యక్తులుగానీ ఫోరెక్స్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్‌బీఐ నంబర్ వన్ నెట్ సెల్లర్‌గా మారింది. గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఆర్‌బీఐ డాలర్లను అమ్మింది. కొనుగోలు చేసింది 945 మిలియన్ డాలర్లుకాగా, అమ్మిన మొత్తం 8.149 బిలియన్ డాలర్లు. అధికారికంగా రూపాయికి మారకపు విలువను ఆర్‌బీఐ నిర్ధారించలేదు. అందుకే, రూపాయి విలువను పెంచడానికి ఆర్‌బీఐ డాలర్ల అమ్మకాన్ని చేపడుతుంది. తద్వారా డాలర్ విలువను తగ్గుతుంది. రూపాయి మారకపు విలువ పెరుగుతుంది. అయితే, పరిమితికి మించి అమ్మకాలు కొనసాగించడంతో డాలర్‌కు రూపాయి రేటు అనిశ్చితి మధ్య కొనసాగుతున్నది. ఈ పరిస్థితి స్టాక్ మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టేస్తున్నది. ఆర్‌బీఐ రూపాయి మారకపు రేటును అధికారికంగా ప్రకటించి, దానిని నిలకడగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. లేదా ఫోరెక్స్ మార్కెట్‌లో జోక్యం చేసుకోకుండా, లావాదేవీలను ఎప్పటిప్పుడు పరిశీలిస్తూ, అత్యవసర సమయాల్లో రంగంలోకి దిగాలి. కానీ, అందుకు భిన్నంగా ఆర్‌బీఐ ప్రత్యక్షంగా ఫోరెక్స్ మార్కెట్‌లో జోక్యం చేసుకొని, రూపాయి విలువ పతనానికి కారణమవుతున్నదని విమర్శకుల అభిప్రాయం. రూపాయి విలువ నిలకడ లేకుండా క్షణక్షణానికి మారిపోవడానికి ఇదే ప్రధాన కారణమని వారు అంటున్నారు. డాలర్లను భారీగా అమ్మడం ఒక్కటే రూపాయి విలువను పెంచేందుకు మార్గమన్న ఆలోచనను ఆర్‌బీఐ విరమించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని సూచిస్తున్నారు.