బిజినెస్

మార్కెట్ దారి ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్ మార్కెట్ ఎటు వైపు వెళుతున్నదనే ప్రశ్న అటు మదుపరులను, ఇటు బ్రోకర్లను తీవ్రంగా వేధిస్తున్నది. లాభాలను నమోదు చేస్తున్న సమయంలోనే హఠాత్తుగా నష్టాలను ఎదుర్కోవడం, నష్టాలు తప్పవని నిర్ధారణకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా లాభాల బాట పట్టడం ఇటీవల కాలంలో సాధారణమైంది. గత వారం చివరిలో నష్టాలతో ముగిసిన సెనె్సక్స్ ఈవారం ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందనేది ఆసక్తి రేపుతున్నది. అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం డాటా, భారీ కంపెనీల త్రైమాసిక ఫలితాలే మార్కెట్‌లో కీలకంగా మారనున్నాయి. డిసెంబర్‌తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సర త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వివిధ కంపెనీలు విడుదల చేయడం మొదలుపెట్టాయి. స్థూల ఆర్థిక సమాచార పాయింట్లను బట్టి మదుపరులు తమతమ పెట్టుబడులపై ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారు. అదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), విప్రో వంటి కంపెనీల త్రైమాసిక ఫలితాలు కేవలం భారత్‌లోగానే, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. బడా కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు నమోదైతే, తత్ఫలితంగా స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతుంది. ఒకవేళ నష్టాలను చూపిస్తే, బేర్ మార్కెట్ బలపడుతుంది. ఈవారంలోనే నిత్యావసర వస్తువుల సప్లయి, అమ్మకాలు, వినియోగాలపై కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) వెలువడనుంది. అదే విధంగా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) కూడా ఇదే వారంలో విడుదలవుతుంది. సహజంగానే వీటి ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడనుంది. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, సీపీఐ, డబ్ల్యూపీఐ సూచీలు స్టాక్ మార్కెట్ భవిష్యత్తును నిర్ధారిస్తాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రీసెర్చ్ హెడ్‌గా పని చేస్తున్న వినోద్ నాయర్ పీటీఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం కూడా ఇదే. ‘రిల్, విప్రో లేదా ఇన్ఫోసిస్.. ఇలాంటి కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని చాలాకాలంగా మనం చూస్తునే ఉన్నాం. ఈవారం కూడా పెద్ద కంపెనీలు ప్రకటించే మూడో త్రైమాసిక ఫలితాలే భారత స్టాక్ మార్కెట్‌ను శాసించడం ఖాయం’ అని వినోద్ చెప్పారు. బ్యాంకింగ్, రియాలిటీ, సర్వీసెస్ రంగాలు లాభాలను ఆర్జించడం ఖాయమని మార్కెట్ విశే్లకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో లాభాలు తగ్గినట్టు శుక్రవారం ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ తీరు మారిపోయింది. లాభాలను నమోదు చేస్తుందనుకున్న సెనె్సక్స్ చివరికి నష్టాలతో ముగిసింది. మరోవైపు 8,260 కోట్ల రూపాయల ఈక్విటీ వాటాలను తిరిగి కొనుగోలు చేయాలని ఇన్ఫోసిస్ గత వారం నిర్ణయించింది. కిరణ్ మజుందార్ షాను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగించాలని కూడా తీర్మానించింది. స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయనున్న ఒక్కో వాటాకు నాలుగు రూపాయల ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు ఇన్ఫోసిస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. లాభాల్లో తగ్గుదల, షేర్ల బై బ్యాక్, ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్‌ను కొనసాగించడం తదితర అంశాలు ఈవారం మార్కెట్‌కు దిశానిర్దేశనం చేయడం ఖాయం. బై బ్యాక్ కారణంగా ఇన్ఫోసిస్ వాటాలను అమ్మకానికి పెట్టిన మదుపరులు ఆ మొత్తాలకు సరిపడా ఇతర కంపెనీల వాటాలను కొనుగోలు చేస్తే, బుల్ రన్ కొనసాగుతుంది. కొత్త వారంలో స్టాక్స్ ట్రేడింగ్‌కు మొదటి రోజైన సోమవారం నాడే పారిశ్రామిక రంగ స్థూల ఉత్పత్తి నివేదిక వెల్లడవుతుంది. గత 17 నెలల్లో ఎన్నడూ లేనంతగా, పారిశ్రామిక స్థూల ఉత్పత్తి 0.5 శాతం పడిపోయిందని సమాచారం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) సూచీ ఎగువకు ఎగబాకినప్పుడే మార్కెట్‌లో కొనుగోళ్ల హడావుడి ఉంటుంది. ఒకవేళ పతనం నమోదైతే, స్టాక్స్‌ను అమ్మడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. మొత్తం మీద ఈవారం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు, సీపీఐ సూచీలతోపాటు రూపాయి మారకపు విలువ, అం తర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర వంటి అంశాలు నిర్ధారిస్తాయి. అయితే, గత వారం కంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని నిపుణుల అంచనా.