బిజినెస్

నష్టాల ప్రమాదం తప్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 16: భారత స్టాక్ మార్కెట్‌లో బుధవారం నాటి ట్రేడింగ్ నష్టాలు తప్పవన్న రీతిలో కొనసాగింది. అయితే, అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణను ప్రదర్శించడంతో, నష్టాల నుంచి తప్పించుకొని, స్వల్ప లాభంతో బయటపడింది. 26,370.74 పాయింట్లతో మొదలైన మార్కెట్ ట్రేడింగ్ అనిశ్చిత పరిస్థితుల్లో నడిచింది. అత్యధికం 36,462.03 పాయింట్లుకాగా, అత్యల్పం 36,278.61 పాయింట్లు. మొత్తం మీద సెనె్సక్స్ 2.96 పాయింట్లు పెరిగి, 36,321.29 పాయింట్ల వద్ద ముగిసింది.
సుమారు రెండు వందల పాయింట్లు పెరుగుతూ, తరుగుతూ కొనసాగిన ట్రేడింగ్ చివరికి నామమాత్రపు లాభంతో ముగిసింది. అమెరికాలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం, బ్రెగ్జిట్ నుంచి యూకే వైదొలగడం వంటి అనేకానేక అంశాలు భారత స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ వార్తలు వెలువడుతున్నకొద్దీ, ట్రేడింగ్‌లో మార్పులు చాలా స్పష్టంగా కనిపించాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) 159.60 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. స్థూలంగా నికర అమ్మకాల విలువ 417.44 కోట్ల రూపాయలుగా నమోదైంది. అమెరికాలో ఆర్థిక బిల్లులకు చట్టసభ ఆమోద ముద్ర వేయకపోవడం అనేక సమస్యలకు తావిస్తున్న విషయం తెలిసిందే. ఈ షట్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన పట్టును వీడడం లేదు. ఇరు వర్గాలు తమ మాటే నెగ్గాలనే పట్టుదలలకు పోవడంతో, అమెరికాతోపాటు యావత్ ప్రపంచ స్టాక్ మార్కెట్‌లోనూ అనిశ్చితి తప్పడం లేదు. బ్రెగ్జిట్ అంశం కూడా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. ఈ రెండు అంశాలు ఆరంభంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించినప్పటికీ, చివరిలో కొంత సానుకూల ధోరణులను ప్రదర్శించడంతో భారత స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టం తప్పింది.
ఇలావుంటే, బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్ బ్యాంక్ (2.66 శాతం), ఇండస్‌ఇండ్ (2.02 శాతం), ఇన్ఫోసిస్ (1.38 శాతం), ఐసీఐసీ బ్యాంక్ (0.68 శాతం), ఓఎన్‌జీసీ (0.62 శాతం), ఎస్‌బీఐ (0.58 శాతం), యాక్సిస్ బ్యాంక్ (0.54 శాతం), రిలయన్స్ (0.40 శాతం), సన్ ఫార్మా (0.33 శాతం), టీసీఎస్ (0.32 శాతం) వాటాలు లాభాలను ఆర్జించాయి. నష్టాలను చవిచూసిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్, వెదాంతా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఇలావుంటే, నిఫ్టీ 3.50 పాయంట్లు పెరిగి, 10,890.30 పాయంట్లకు చేరింది.