బిజినెస్

డీసీబీ నికర లాభాల్లో 51 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రైవేట్ సెక్టార్‌లోని డీసీబీ బ్యాంకు మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించింది. గత ఏడాది డిసెంబర్ 31తో పూర్తయ్యే మూడో త్రైమాసికంలో 6.1 కోట్ల స్థూలలాభంతో 50.8 శాతం అధిక లాభాలను ఆర్జించింది. రుణాలపై గత త్రైమాసికంలో 685.72 కోట్ల ఆదాయం రాగా, ఈ త్రైమాసికంలో అది 871.78 కోట్లకు చేరుకుందని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే రుణాలపై స్థూల నిరర్ధక ఆస్తులు 1.89 శాతం నుంచి 1.92 శాతానికి పెరిగాయి. అలాగే మొత్తం ఆస్తులపై ఎన్‌పీఏ శాతం 0.89 నుంచి 0.71 శాతానికి తగ్గినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి.