బిజినెస్

ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.6వేల కోట్ల కేంద్ర సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రభుత్వ రంగ బ్యాంకు ‘ఎగ్జిమ్ బ్యాంకు’కు ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రెండేళ్ల కాలంలో 6వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ సాయం అందితే ఈ బ్యాంకు మూలధనం మొత్తం 20వేల కోట్ల రూపాయలకు చేరుతుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.4.500 కోట్లు, 2019-20లో రూ.1,500 కోట్ల వంతున ఈ సాయం అందుతుందని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ వివరించారు. కేబినెట్ సమావేశం అనంతరం బుధవారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. తొలుత ఎగ్జిమ్ బ్యాంకు ఎగుమతులకు రుణాలివ్వడం, అంతర్జాతీయ ఎగుమతుల రుణ ఏజెన్సీలతో సంబంధాలు కలిగివుండానికే పరిమితమైంది. ఆ తర్వాత పరిశ్రమలు, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ ద్వారా అధికోత్పత్తికి తోడ్పాటునందించే వరకు విస్తరించింది. సాంకేతికతను దిగుమతి చేసుకోవడం, వస్తూత్పత్తిని, ఎగుమతులను, మార్కెటింగ్ వ్యవహారాలతోబాటు అంతర్జాతీయంగా ప్రీ షిప్‌మెంట్, పోస్టు షిప్‌మెంట్‌కు సంబంధించిన పెట్టుబడులకు చేయూతనిచ్చే వరకు ఈ బ్యాంకు విస్తరించింది.