బిజినెస్

గ్లోబల్ థింకర్స్ జాబితాలో ముఖేష్ అంబానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్ థింకర్స్(ప్రపంచ ఆలోచనాపరుల) జాబితాలో స్థానం లభించింది. ప్రతిష్టాత్మకమైన జాబితాలో అంబానీతోపాటు అలీబాబా ఫౌండర్ జాక్‌మా, అమేజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డేలున్నారు. గ్లోబల్ థింకర్స్ 2019 జాబితాను సంస్థ అధికారిక వెబ్‌సెట్‌లో పొందుపరిచింది. మొత్తం 100 మంది పేర్లు జాబితాలో చోటుచేసుకున్నా యి. విదేశాంగ విధానానికి సంబంధించి ప్రపంచ ఆలోచనాపరుల పూర్తి జాబితాను ఈనెల 22న విడుదల చేయనున్నట్టు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ముఖేష్ అంబానీ ఆసియా సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. 2018లో 44.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో జాక్‌మాను అధిగమించారు. చమురు, గ్యాస్, రిటైల్ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్నారు. అలాగే జియో వెంచర్ ప్రవేశపెట్టి దేశంలోని టెలికాం రంగంపై అధిపత్యాన్ని చాటుకున్నారు. టెలికాం మార్కెట్‌లో జియో అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్‌కు ముఖేష్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. జియో లాంచింగ్ సంచనాలు సృష్టించింది. సెల్యూలర్ డేటా, వాయిస్ మొదట ఆర్నెల్ల మాటు ఉచితంగా ప్రకటించారు. కనీసం వంద మిలియన్ల మంది ఖాతాదారులను ఆకట్టుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ విప్లవాన్ని తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో జియో విజయవంతమైందని వెబ్‌సైట్ వెల్లడించింది. డిజిటల్ ఎయిర్‌వేవ్స్‌ను లైఫ్‌స్టయిల్ ప్రొడక్ట్స్‌కు విక్రయించడం ద్వారా గూగుల్, ఫెస్‌బుక్‌కు సవాల్ విసరనున్నారు. మొత్తం 10 రంగాల్లో పది మందిని జాబితా కోసం ఎంపిక చేస్తారు.