బిజినెస్

లక్ష్య సాధనలో వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 18: దాదాపు రూ.80వేల కోట్లు పెట్టుబడులను వెనక్కు తీసుకునే ‘డిసినె్వస్ట్‌మెంట్’ లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం వంద శాతం అందుకునే అవకాశాలు లేవని ఆర్థిక రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందులో దాదాపు 20వేల కోట్ల రూపాయలు తగ్గవచ్చని ఇందుకు ఈ సంవత్సరం ఆర్థిక లోటు 3.5శాతానికి చేరుకున్న ఆర్థిక లోటే కారణమని అంటున్నారు. ఈ యేడాది ఆర్థిక లోటును 3.3 శాతానికి మించనీయ కూడదని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా అది దాదాపుగా అసాధ్యమైంది. దీనికి డిసినె్వస్ట్‌మెంట్ లక్ష్యాల సాధనలో తేడా రావడంతోబాటు, జీఎస్టీ పన్ను వసూళ్లలో తగ్గుదల నమోదు కావడమే కారణాలని రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ రేటింగ్స్’ శుక్రవారం నాడిక్కడ విశే్లషించింది.‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 వేల కోట్ల పెట్టుబడులు ‘డిసినె్వస్ట్‌మెంట్’ ద్వారా వెనక్కు తీసుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం ఓ సవాలుగా మారిందని ప్రత్యేకించి మార్కెట్లలో స్థిరమైన ఆర్థిక పరిస్థితులు లేకపోవడమేనని ఆ విశే్లషణ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెనె్వస్ట్‌మెంట్ లక్ష్యంలో 60 వేల కోట్లు మాత్రమే సాధించే వీలుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. గత నాలుగేళ్లుగా 2017-18లో మినహా ఏ సంవత్సరమూ ఈ డిసినె్వస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేకపోయిందని తెలిపింది. సరాసరి 65 శాతం మాత్రమే 2014, 2017 సంవత్సరాల్లో లక్ష్యసాధన జరిగిందని, 2014లో మరీ అథమంగా 53 శాతం మాత్రమే లక్ష్య సాధన జరిగిందని అధ్యయన నివేదిక వెల్లడించింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిసినె్వస్ట్‌మెంట్ ఒక ట్రిలియన్ రూపాయల మేర చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఇది ముందే నిర్ధేశించిన రూ.72,500 కోట్లకు అధికం. ఇంకా రెండు నెలల కాలం ఉండగా డిసెంబర్ నాటికి లక్ష్యంలో 43 శాతం 32,142 కోట్ల రూపాయలు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ ఎంటర్‌ప్రైజెస్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ద్వారా సుమారు రూ. 25,325 కోట్ల సమీకరణ జరిగింది. తద్వారా ఏకకాలంలో వివిథ సీపీఎస్‌ఈల్లో సింగిల్ ఆఫరింగ్ ద్వారా ప్రభుత్వ వాటాల విక్రయానికి వీలుకలిగింది. రెండోదఫా ‘ఆఫర్ ఫర్ సేల్’ రూ.5,218 కోట్లకు వచ్చే అవకాశాలున్నాయి.
తొలిదశలో 1,500 కోట్ల రూపాయలు బైబ్యాక్‌ల ద్వారా సమీకరించడం జరిగింది. ఈ క్రమంలో ‘్భరత్ 22 ఈటీఎఫ్’ పేరిట మరో ట్రాంచేను తీసుకవచ్చే యత్నాలను ప్రభుత్వం ఆరంభించింది. దీని ద్వారా రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్‌లో 52.63 శాతం వాటాలను విక్రయించి 14వేల కోట్ల సమీకరించేందుకు నిర్ణయించిందని నివేదిక వెల్లడించింది. అలాగే ప్రభుత్వ రంగ యూనిట్ల నుంచి మరో 12 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని నిర్ణయించినట్టు వివరించింది. ఐతే ఈ చర్యలు ఆర్థికలోటును ఎంతమేర భర్తీ చేస్తాయన్నది తెలియాల్సివుంది.