బిజినెస్

‘రిల్’ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) శుక్రవారం దూకుడుగా ముందుకు దూసుకెళ్లింది. ఆ కంపెనీ స్టాక్స్ ఏకంగా 4.43 శాతం లాభాలను ఆర్జించాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయలకుపైగా త్రైమాసిక లాభాన్ని ప్రకటించిన భారత తొలి కంపెనీగా రికార్డు సృష్టించిన రిల్ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెట్టుబడిదారులు ఈ కంపెనీ షేర్లను కొనేందుకు ఆసక్తిని ప్రదర్శించడంతో, మిగతా కంపెనీల షేర్ల ట్రేడింగ్ నత్తనడకన సాగింది. రిల్ తర్వాత లాభపడిన కంపెనీల్లో కోటక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. కాగా, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీలోనూ రిల్ భారీ లాభాలను ఆర్జించింది. ఈ కంపెనీ వాటాల ధర 4.53 శాతం పెరిగాయి. విప్రో 3.32, కోటక్ మహీంద్ర 1.66, హిందాల్‌కో 1.43, హెచ్‌సీఎల్ టెక్ 1.39 శాతం చొప్పున లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సన్ ఫార్మా అత్యధికంగా 8.52 శాతం పతనాన్ని చవిచూడగా, నిఫ్టీలోనూ ఆ కంపెనీ షేర్లకు డిమాండ్ పడిపోయింది. 8.51 శాతం నష్టంతో షేర్ల అమ్మకాలు కొనసాగాయి. భారతీ ఎయిర్‌టెల్ 6.47, గెయిల్ 3.28, హెచ్‌పీసీఎల్ 2.01, ఎల్ అండ్ టీ 1.97 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి.