బిజినెస్

మార్కెట్‌కు ‘రిల్’ ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)కు చెందిన చెందిన షేర్లు శుక్రవారం రెండు శాతం లాభాల వృద్ధిని నమోదు చేసి, మార్కెట్‌కు ఊతమిచ్చాయ. ప్రైవేటు రంగంలో కేవలం త్రైమాసికంలోనే రూ.10వేల కోట్ల లాభాలు గడించిన సంస్థగా రికార్డు సృష్టించడంతో ఈ సంస్థ వాటాల పెరుగుదలకు ఊతం లభించింది. మార్కెట్లలో ఉదయం సానుకూల పరిస్థితుల్లో ఆరంభమైన ఈ కంపెనీ వాటాలు 2శాతం పెరుగుదల నమోదుచేసి 1,156.55 కోట్ల రూపాయల అదనపు రాబడి చేకూరింది. పెట్రో కెమికల్, రీటెయిల్, టెలికాం వాణిజ్య విభాగాల్లో ఈ సంస్థ భారీగా లాభాలను ఆర్జించడంతో వాటివైపు మదుపర్లు మొగ్గుచూపారు. రీపైనరీ మార్జిన్లు మాత్రం కొత్త తగ్గుదల నమోదు చేశాయి. కాగా గడచిన డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ 8.8 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.10,215 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే ఒక్కో షేర్‌పైన 17.3 రూపాయలు ఈ కంపెనీకి లాభాలు వచ్చాయి. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీకి రూ.9,420 కోట్ల లాభాలు వచ్చాయి. 2013లో జనవరి నుంచి మార్చి వరకు 14,512.81 కోట్లు స్థూల ఆదాయాన్ని ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) భారతీయ సంస్థల్లో అత్యధిక త్రైమాసిక లాభాలు గడించిన సంస్థగా గణుతికెక్కింది.