బిజినెస్

పొగాకు ఎగుమతులపై చైనాతో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: భారత్ నుండి నాణ్యమైన పొగాకు ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు చైనాతో ఒప్పందం కుదిరింది. సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత్ వాణిజ్య విభాగం కార్యదర్శి డాక్టర్ అనూప్ వాద్వాన్ తన బృందంతో అక్కడి వాణిజ్య శాఖ ఉప మంత్రి జాంగ్ జివెన్‌తో చర్చలు జరిపారు. వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పొగాకును దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాలు అందిస్తున్న ధరలకు పొగాకును ఎగుమతి చేస్తామని ఈ మేరకు భారత్ వాణిజ్య విభాగం కార్యదర్శి డాక్టర్ అనూప్ వాద్వాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది భారత పొగాకు బోర్డు చైర్మన్ సునీత పలుమార్లు భారత వాణిజ్య శాఖ ద్వారా చైనాతో పొగాకు ఎగుమతులపై చర్చలు జరిపారు. తాజాగా బీజింగ్‌లో జరిగిన చర్చల్లో పొగాకు ఎగుమతులపై ఒప్పందం కుదరడంపై గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో చైర్మన్ సునీత హర్షం వ్యక్తంచేశారు. అతిపెద్ద మార్కెట్ అయిన చైనాకు పొగాకు ఎగుమతి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశముందని చైర్మన్ సునీత పేర్కొన్నారు.