బిజినెస్

18 శాతం త్రైమాసిక లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రూ.246 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రైవేటు రంగ జీవిత బీమా సంస్ధ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ మంగళవారం తన త్రైమాసిక వాణిజ్య ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో 18.3 శాతం అదనంగా మొత్తం రూ.245.63 కోట్ల లాభాలను ఆర్జించినట్టు ఆ గణాంకాలు తెలిపాయి. 2017లో ఇదే త్రైమాసికంలో ఈ సంస్థకు రూ.207.32 లాభాలు వచ్చాయి. ఐతే మొత్తం కంపెనీ ఆదాయం మాత్రం ఈ త్రైమాసికంలో తగ్గింది. 2017లో ఇదే కాలంలో రూ.9,684.46 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ కంపెనీ తాజా త్రైమాసికంలో 9.303.09 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ సంస్థకు ఛీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా నీరజ్ అశ్విన్ షా నియమితులవగా ఆయన వచ్చే మార్చి 1నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రైవేటు రంగంలో గడచిన యేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 21 శాతం కొత్త వ్యాపార సమీకరణలతో ఈ సంస్థ అగ్రభాగాన నిలిచింది. 2017-18లో ఇదే కాలానికి ఈ సంస్థకు 18.4 శాతం కొత్త వ్యాపార సమీకరణ జరిగింది. ఈ సంస్థలో ఇన్సూర్ చేసిన వారి సంఖ్య ఆ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 71 శాతం అంటే 3.48 కోట్లకు పెరిగింది.
రూ.647 కోట్ల లాభాల్లో ఆసియన్ పెయింట్స్
తాజా త్రైమాసికంలో ఆసియన్ పెయింట్స్ సంస్థ సైతం 14.09 శాతం అదనపు లాభాలను సంతరించుకుంది. ఈ కాలంలో మొత్తం రూ.647.15 కోట్ల అదనపు లాభాలు వచ్చాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. గత యేడాది ఇదే కాలంలో రూ.567.21 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ సంస్థ రూ.5,293.99 కోట్ల ఆదాయాన్ని ఈ త్రైమాసికంలో గడించింది. 2017-18లో ఇదే కాలంలో రూ.4,267.49 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ వివరించింది. ఈ సంస్థ షేర్లు మంగళవారం 0.99 శాతం దిగువన ట్రేడ్ అయ్యాయి.
15 శాతం పెరిగిన టీవీఎస్ లాభాలు
టీవీఎస్ మోటార్స్ కంపెనీ గడచిన త్రైమాసికంలో 15.57 శాతం అదనంగా మొత్తం రూ.178.39 కోట్ల అదనపు లాభాలను ఆర్జించింది. గడచిన యేడాది ఇదే కాలంలో రూ.154.35 కోట్ల లాభం వచ్చిందని సంస్థ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ఆపరేషన్స్ విభాగం ద్వారా సంస్థకు రూ.4,663.98 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు క్రితం ఇదే త్రైమాసికంలో 3,698.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2017లో ఈ కంపెనీ ఈ త్రైమాసికంలో 7.99 లక్షల వాహనాలు విక్రయించగా, తాజా త్రైమాసికంలో 9.50 లక్షల వాహనాలు అమ్ముడైనట్టు సంస్థ వివరించింది. ఇందులో స్కూటర్ల విక్రయాలు 31.7 శాతం ఉన్నాయి. అలాగే ఈ చెన్నై కేంద్ర కార్యాలయ సంస్థ ఎగుమతులు సైతం 25.8 శాతం పెరిగాయి.
హావెల్స్ ఇండియా లాభాలు రూ.195.67 కోట్లు
విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హావెల్స్ ఇండియా తాజా త్రైమాసికంలో 0.67 శాతం అదనపు లాభాలను గడించింది. మొత్తం రూ.195.67 కోట్లు ఆర్జించినట్టు సంస్థ తెలిపింది. గత యేడాది ఈ కాలంలో గడించిన రూ.194.36 కోట్ల లాభాలకన్నా ఇది స్వల్పంగా తక్కువ. అలాగే ఈ త్రైమాసికంలో రూ. 2,551.4 ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. గత త్రైమాసికంలో ఆదాయం రూ.1,993.53 అని కంపెనీ వివరించింది. స్విచ్‌గియర్ విభాగంలో 416.2 కోట్లు, కేబుల్ విభాగంలో 820.3 కోట్లు వంతున ఆదాయం వచ్చిందని సంస్థ తెలిపింది.