బిజినెస్

దూసుకెళుతున్న ఐపీపీబీ 1.25 లక్షలకుపైగా శాఖలతో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ఖాతాదారులకు విలువైన సేవలు అందించడంతలో ప్రభుత్వ రంగంలోవ పని చేస్తున్న భారత తపాలా చెల్లింపుల బ్యాంక్ (ఐపీపీబీ) ముందున్నదని, ఈ కారణంగానే బ్యాంకింగ్ రంగంలో దూసుకెళుతున్నదని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. మహామతి ప్రనాథ్‌జీ పోస్టల్ స్టాంపును ఆయన శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ ఇప్పటికే 1.25 లక్షలకుపైగా శాఖల మైలురాయిని అధిగమించిందని చెప్పారు. ఈ సంఖ్య త్వరలోనే 1.5 లక్షల వరకూ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన ఐపీపీబీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఐపీపీబీ పని చేస్తున్నాయని, లక్ష మంది పోస్ట్‌మెన్, ‘గ్రామీణ డాక్ సేవకులు’ కలిసి డిజిటల్ సామాగ్రి సాయంతో ఆర్థికపరమైన సేవలు అందిస్తున్నారని మనోజ్ సిన్హా వివరించారు. లక్ష రూపాయల వరకూ విలువైన డిపాజిట్లను ఆమోదిస్తున్నామన్నారు. అదే విధంగా మొబైల్ పేమెంట్స్, నగదు బదిలీ, కొనుగోళ్లతోపాటు ఏటీఎం, డెబిడ్ కార్డ్ జారీ వంటి ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా ఐపీపీబీ ద్వారా అందిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తు సేవలు మరింత విస్తృతమవుతాయని, గ్రామగ్రామానికీ విస్తరిస్తుందని అన్నారు.