బిజినెస్

సెన్సెక్స్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్ మార్కెట్ శుక్రవారం ఆశాజనకంగానే మొదలైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. కానీ, ద్వితీయార్ధంలో అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో నష్టాలు తప్పలేదు. సెనె్సక్స్ అత్యధికంగా 36,474.48 పాయింట్లు, అత్యల్పంగా 35,953.15 పాయింట్లు నమోదయ్యాయి. చివరి క్షణాల్లో కొంత వరకూ మెరుగుపడడంతో, చివరికి 36,025.54 పాయింట్ల వద్ద సెనె్సక్స్‌కు తెరపడింది.

ముంబయి, జనవరి 25: స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 169.56 పాయింట్లు పతనమైంది. ఈవారం లావాదేవీలకు చివరి రోజుకావడంతో, మదుపరులు స్టాక్స్ కొనుగోలుకు పోటీపడతారన్న అభిప్రాయం తొలుత వ్యక్తమైంది. కానీ, అంతర్జాతీయ మార్కెట్ల సూచీలు ఒకవైపు, దేశీయ పెట్టుబడిదారుల అనాసక్తత మరోవైపు బుల్ రన్‌ను నిరోధించింది. ఫలితంగా నష్టాలను చవిచూసిన సెన్సెక్స్ 36,025.53 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీకి కూడా నష్టాల తాకిడి తప్పలేదు. 69.25 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,780.55 పాయింట్లుగా నమోదైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో జరిగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్ బ్యాంక్ (2.71 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (2.54 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.81 శాతం), టీసీఎస్ (0.91 శాతం), వేదాంత (0.88 శాతం) లాభపడ్డాయి. నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల్లో మారుతీ సుజికీ (7.40 శాతం), హీరో మోటార్ (4.23 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (2.16 శాతం), ఏషియన్ పెయింట్స్ (2.00 శాతం), మహీంద్ర అండ్ మహీంద్ర (1.94 శాతం) ఉన్నాయి. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీలో భారతీ ఇన్‌ఫ్రా (6.46 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (3.02 శాతం), ఎస్ బ్యాంక్ (2.11 శాతం), సిప్లా (1.54 శాతం) భారతీ ఎయిర్‌టెల్ (1.28 శాతం) లాభాలను సంపాదించాయి. జీ ఎంటర్‌టైనె్మంట్ (30.92 శాతం), మారుతీ సుజికీ (8.11 శాతం), అల్ట్రా టెక్ (6.93 శాతం), హీరో మోటార్ (4.27 శాతం), ఇండియాబుల్స్ (3.82 శాతం) కంపెనీల వాటాలు భారీగా నష్టపోయాయి.
ఎస్ బ్యాంక్ లాభాలు..
స్టాక్ మార్కెట్‌లో ఎస్ బ్యాంక్ దూసుకెళుతున్నది. ఈ సంస్థ షేర్లు వరుసగా రెండో రోజు కూడా లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్ బ్యాంక్ షేర్లు 13.74 శాతం లాభాల్లో నడిచాయి. ఫలితంగా షేర్ విలువ 245 రూపాయలకు చేరింది. కాగా, దేశంలోని ప్రధాన కంపెనీల షేర్లకు సంబంధించిన సూచీలపై మధ్యాహ్నంలోపే స్పష్టత రావడం గమనార్హం. అదే క్రమంలో ఎస్ బ్యాంక్ వాటాలు కూడా జోరుగా ట్రేడయ్యాయి. బీఎస్‌ఈలో 1,02,71,00 షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 13 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఈ బ్యాంక్ వాటాలకు ఏర్పడిన డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ట్రేడింగ్ తీరు స్పష్టం చేస్తున్నది. గురువారం కూడా ఈ బ్యాంక్ వాటాలు తొమ్మిది శాతానికిపైగా లాభాలను నమోదు చేసింది.
నష్టాల్లో మారుతీ సుజికీ మారుతీ సుజికీ వాటాలు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. 7.40 శాతం నష్టపోయి, వాటాదారులను ఆందోళనకు గురి చేశాయి. నష్టాలను చవిచూసిన మిగతా కంపెనీలతో పోలిస్తే మారుతీ సుజికీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.