బిజినెస్

ఎన్‌ఐఐటీ త్రైమాసిక లాభాల్లో 1.5 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: నిపుణత, సామర్ధ్యాలను అభివృద్థి చేసే సంస్థగా గుర్తింపు ఉన్న ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌కు గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక లాభాల్లో 1.5 శాతం తగ్గుదల నమోదైంది. ఈ మూడు నెలల్లో రూ.19.4 లాభాలు వచ్చాయని, గడచిన యేడాది ఇదే త్రైమాసికంలో రూ.19.7 కోట్ల లాభాలు వచ్చాయని అధికారులు వివరించారు. విదేశీ మారకద్రవ్య ప్రభావం తమ సంస్థపై ప్రతికూలతలు చూపిందని ఇందువల్ల సుమారు రూ.5.2 కోట్ల లాభాలు కోల్పోయామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఐతే స్థూల ఆదాయం మాత్ర ఈ త్రైమాసికంలో 8.7 శాతం పెరిగి 227.8 కోట్ల రూపాయలు సమకూరిందని, గత యేడాది ఇదే త్రైమాసికంలో రూ.209.4 ఆదాయం వచ్చిందని ఎన్‌ఐఐటీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కే తండాని తెలిపారు. తంమ సంస్థ కార్పొరేట్ లెర్నింగ్ బిజినెస్‌లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 25 శాతం పెరిగి స్థిరమైన ఆపరేటింగ్ మార్జిన్లతో రూ.161.4 కోట్లు సమకూర్చాయని తెలిపారు. లైఫ్ సైనె్సస్‌లో సీజీఎల్ ఫోకస్‌తో గడచిన త్రైమాసికంలో రెండు మల్టీ ఇయర్ మేనేజ్డ్ శిక్షణ సేవలకు ఒప్పందాలు కుదిరాయని, స్కిల్స్ అండ్ కెరీర్ గ్రూప్ (ఎస్‌ఎన్‌సీ) 63కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ మూడు నెల్ల కాలంలో గడించిందని తెలిపారు.