బిజినెస్

పన్ను చెల్లింపు డిమాండ్‌పై సిద్ధార్ధ, కాఫీ డేల వాటాలను స్తంభింపజేసిన ఐటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ప్రభుత్వానికి పన్ను చెల్లించాలన్న డిమాండ్‌తో మైండ్‌ట్రీలో వీజీ సిద్ధార్ధ, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలకు చెందిన కొన్ని వాటాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం బెంగళూరు కేంద్రంగా గల కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులపై తీవ్ర ప్రభావం చూపనుంది. మైండ్‌ట్రీలో వీజీ సిద్ధార్ధకు 21 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని షేర్లను ఐటీ కంపెనీలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని బీఎస్‌ఈకి సైతం శనివారం తెలియజేసింది. అయితే, ఆ రెండు సంస్థలు పన్ను చెల్లించాలన్న డిమాండ్‌తో 281బీ సెక్షన్ కింద తమ వాటాలను స్తంభింపజేస్తున్నట్టు బెంగళూరులోని ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని మైండ్‌ట్రీ తెలిపింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు 22.2 లక్షల ఈక్విటీ షేర్లు, సిద్ధార్ధకు 52.7 లక్షల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఐటీ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈనెల 25 నుంచి మరో ఆరు నెలల కాలం పాటు ఆ రెండు సంస్థలు ఎలాంటి వాటాల క్రయవిక్రయాలు జరపడంపై నిషేధం అమల్లో ఉంటుంది.
గత ఏడాది డిసెంబర్‌లో ముగిసిన క్వార్టర్‌కు నాటికి మైండ్‌ట్రీలో సిద్ధార్ధ 54.69 లక్షల షేర్లు (3.3 శాతం వాటా), కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ 10.63 శాతం వాటా) కలిగివున్నాయి. కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్ 1.05 కోట్ల షేర్లు (6.45 శాతం) వాటా కలిగివున్నాయి. మైండ్‌ట్రీ ప్రమోటర్లు సుబ్రొతో బాగ్చీ, కృష్ణకుమార్ నటరాజన్, ఎన్‌ఎస్ పార్థసారధి, రొస్టోవ్ రావణన్ 13 శాతం వాటాలు కలిగివున్నాయి.