బిజినెస్

నిర్మాణ రంగ ప్రాజెక్టులకు జీఎస్టీ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 26: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వాటాలను జాయింట్ డెవలప్‌మెంట్ (జెడీ) విధానంతో ఆరంభించడంతో ఇటీవల కొనే్నళ్లుగా ప్రగతిపథంలో ఉన్న నిర్మాణ రంగం ప్రస్తుతం జీఎస్టీ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని జాయింట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై విధించిన కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జరిగే అభివృద్ధి తిరోగమనంలో పడిందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. 2017లో 93 శాతం, 18లో 71 శాతం వంతున పెరిగిన ఈ తరహా నిర్మాణాలు 2018లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయని నివేదిక తెలిపింది. మొత్తం 196 ప్రాజెక్టులపై ఇక్రా అధ్యయనం జరిగింది. 2013 నుంచి 2015 వరకు సుమారు 55 శాతం ప్రాజెక్టులు ఈ సంయుక్త అభివృద్ధి విధానం(జేడీ)తో ఆరంభమయ్యాయి. తొలుత ఈ తరహా ప్రాజెక్టులు బెంగళూరులో అక్కడి స్థానిక వ్యాపారులు ప్రారంభించారు. ఆర్‌ఈఆర్‌ఏకు విశేష ప్రాచుర్యం రావడంతో 2017 జూలై1 నుంచి పెద్దయెత్తున అమలులోకి వచ్చింది. పాన్ ఇండియా విధానంతో ఈ విధానం ఇతర పట్టణాలకు విస్తరించిందని ఇక్రా తెలిపింది. జెడీ విధానంలో భూమి సొంతదారు, డెవలప్‌మెంట్ చేసే వ్యక్తి సంయుక్త ఒప్పందంతో నిర్మాణాలు చేపడతారు. ఈ తరహా జాయింట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు 2016లో సుమారు 72 శాతం ఆరంభమయ్యాయి. 2017 నాటికి 93 శాతానికి చేరాయి. అయితే 2018లో 71 శాతం తగ్గుదల నమోదైంది. జేడీ మోడల్స్‌కు జీఎస్టీని వర్తింపజేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది. ఐతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ కేంద్రం ఇటీవల చర్యలు చేపట్టిన క్రమంలో ఈ జాయిట్ డెవలమ్ మోడల్‌కు ఊతం లభిస్తుందని, ఆర్థిక సంవత్సరం అంతానికి 76 శాతం పెరుగుదల నమోదయ్యే అవకాశాలున్నాయని ఇక్రా నివేదిక తెలిపింది.