బిజినెస్

‘క్రీమ్ 21’ కంపెనీ బాధ్యతలు ఇమామీ చేతికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: దేశీయంగా పేరెన్నికగన్న ‘శీఘ్రంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువులు’ (ఎఫ్‌ఎంసీజీ) తయారీ సంస్థల్లో ఒకటైన ‘ఇమామీ’ జర్మనీకి చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ ‘క్రీమ్ 21’ కంపెనీ నిర్వహణను చేపట్టబోతోంది. ఇమామీ శుక్రవారం నాడిక్కడ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. ఐతే ఇందుకోసం ఎంతమొత్తం వెచ్చించేదీ ఆ సంస్థ వెల్లడించలేదు. ప్రస్తుతం మధ్య, తూర్పు దేశాలతోబాటు, మరికొన్ని మార్కెట్లలో ఈ ‘క్రీమ్ 21’ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా మొత్తం విక్రయాల్లో ఈ క్రీం 1.5 శాతం ఉందని ఇమామీ తెలిపింది. సేంద్రీయేతర మార్గాల్లో అభివృద్ధిని సాధించాలన్న కంపెనీ వ్యూహంలో భాగంగానే ఈ అంతర్జాతీయ వాణిజ్య సమీకరణకు శ్రీకారం చుట్టామని కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఇమామీ సంస్థ డైరెక్టర్ హర్ష వీ అగర్వాల్ తెలిపారు. తమ సంస్థలోని పంపిణీ, వౌలిక వసతులను మరింత పటిష్టవంతం చేసి బ్రాండ్ విలువను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాగా జర్మనీకి చెందిన ఈ క్రీమ్ 21 సంస్థ నిర్వహణను 2003లో ఆంట్జే జే విలియమ్స్ స్టిక్కెల్ సంస్థ చేపట్టింది. స్కిన్ కేర్, బాడీ కేర్ ఉత్పత్తులు ఈ సంస్థ నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తున్నాయి. క్రీమ్‌లు, లోషన్లు, షవర్ గెల్స్, సన్‌కేర్, మెన్‌కేర్ రేంజ్‌లు తయారవుతున్నాయి.