బిజినెస్

బంగారానికి పెరుగుతున్న డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రానున్న పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నగల వ్యాపారులు, రిటైలర్లు కొనుగోళ్ల కోసం ఎగబడుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 140 రూపాయల వరకు అత్యధికంగా పెరిగింది. దీంతో ఈ వారాంతానికి 10 గ్రాముల బంగారం 33,000 వేల రూపాయలకు చేరుకుంది. అదేసమయంలో వెండి తయారీదారులు, ఉత్పత్తిదారులు కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో గతవారం ముగింపు రోజున వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మిశ్రమ ప్రభావం నేపథ్యం బంగారం ధరలు పెరగడానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా వచ్చేనెల రెండోవారం నుంచి మంచి రోజులు వస్తున్న నేపథ్యంలో పెళ్లి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్థానిక నగల వ్యాపారులు, రిటైల్ వ్యాపారుల నుంచి బంగారానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఔన్స్ బంగారం ధర ఇపుడు 1,284.30 డాలర్లకు పెరగగా, గత వారం ఒక ఔన్స్ బంగారం ధర 1,282.30 డాలర్లుగా ఉంది. వెండి ప్రస్తుతం ఒక ఔన్స్ ధర 15.46 డాలర్లు ఉండగా, గత వారం ఒక ఔన్స్ ధర 15.41గా కొనసాగింది. శనివారం రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. ఈ వారం మధ్యకాలంలో దేశరాజధాని ఢిల్లీలో బంగారం 99.9 శాతం, 99.5 శాతంతో ఈ వారం అత్యధికంగా 10 గ్రాముల ధర రూ. 33,200, 33,050గా కొనసాగింది. మెటల్‌లోని రెండు రకాలు రూ.33,325, రూ.32,175గా పలికిం ది. బంగారం కొనుగోలు చేయడానికి పైస్థాయి నుంచి ముందుకు రావడానికి ఆసక్తి చూపకపోవడంతో వీటి ధరలు ఈవారాంతం నాటికి 10 గ్రాము లు రూ. 33,300, 33,150లకు పడిపోయాయి.