బిజినెస్

సీఎన్‌జీ వాహనాల వినియోగంలో ఢిల్లీ ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: సీఎన్‌జీ వాహనాలను వినియోగించడంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈనెల ఒకటవ తేదీనాటి గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలోలో 10,58,111 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. పదిలక్షల వాహనాల మైలురాయిని అధిగమించిన తొలి రాష్ట్రం కూడా ఢిల్లీ కావడం విశేషం. రాష్ట్ర రాజధానిసహా ఎన్నో నగరాలు, పట్టణాలు తీవ్రమైన కాలుష్య సమస్యతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. పర్యావరణాన్ని పరిరక్షించి, ఢిల్లీని కాలుష్య సమస్య నుంచి తప్పించడానికి అటు సుప్రీం కోర్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సంపీడన సహజ వాయువు (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్/ సీఎన్‌జీ) వాహనాలను ప్రోత్సహించాయి. కాలుష్యానికి కారణమైన అంశాలను గుర్తించి, పరిష్కార మార్గాలను అనే్వషిస్తున్నాయి. ఈ కారణంగానే ఢిల్లీలో సీఎన్‌జీ వాహనాల వినియోగం ఇటీవల కాలంగా గణనీయంగా పెరిగి, అగ్రస్థానానికి చేరింది. మహారాష్ట్ర 8,89,921 వాహనాలతో రెండో స్థానంలో ఉంటే, గుజరాత్ 8,85,049 వాహనాలను కలిగి ఉండడం ద్వారా మూడో స్థానంలో ఉంది. హర్యానా (1,55,502 వాహనాలు), ఉత్తరప్రదేశ్ (1,49,180 వాహనాలు), మధ్యప్రదేశ్ (35,479 వాహనాలు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాలను ఆక్రమించాయి. కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈ జాబితాలో ఏడు, ఎనిమిది స్థానాలు దక్కాయి. తెలంగాణ 24,630 వాహనాలతో ఆంధ్రప్రదేశ్ కంటే ఒక అడుగు ముందుంది. ఏపీలో 19,572 సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. ‘టాప్-10’ జాబితాలో త్రిపుర (11,263 వాహనాలు), రాజస్థాన్ (8,108 వాహనాలు) తొమ్మిది, పది స్థానాలను సంపాదించాయి.
సీఎన్‌జీ ‘టాప్-10’ రాష్ట్రాలివే..
1. ఢిల్లీ, 2. మహారాష్ట్ర, 3. గుజరాత్, 4. హర్యానా, 5. ఉత్తర ప్రదేశ్, 6. మధ్యప్రదేశ్, 7. తెలంగాణ, 8. ఆంధ్రప్రదేశ్, 9. త్రిపుర, 10. రాజస్థాన్.