బిజినెస్

కనకానికి ‘కల్యాణ’ కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: పెళ్లిళ్ల సీజీన్ కనకం ధరలకు కొత్త కాంతులిచ్చింది. విఫణిలో సోమవారం తులం (10 గ్రాముల) బంగారం ధర 350 రూపాయలు పెరిగి మొత్తం రూ.33,650 పలికింది. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ వల్ల బంగారానికి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. వెండి ధరలు సైతం కిలోపై 850 రూపాయలు పెరిగి మొత్తం ధర రూ.40,900 చేరింది. బులియన్ మార్కెట్లో వ్యాపారుల అంచనాలను బట్టి పారిశ్రామిక విభాగాలు, నాణేల మార్కెట్ల నుంచి వచ్చిన డిమాండ్ వెండి ధరలకు ఊతం ఇచ్చింది. ఇక విదేశీ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,300 అమెరికన్ డాలర్లు పలికడం సైతం స్థానిక మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. గత శనివారం రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బులియన్ మార్కెట్లు మాతపడ్డాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్ 1,301.82 డాలర్లు, వెండి ఔన్స్ ధర 15.77 డాలర్లు పలికాయి. కాగా మనదేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 33,650, 99.5 శాతం స్వచ్ఛ బంగారం రూ.33.500 వంతున అమ్ముడయ్యాయి. ఇక ఎనిమిది గ్రాముల బరువుండే సవర బంగారం సోమవారం రూ.200 పెరిగింది. మొత్తం ధర 25,700కు చేరింది. వెండి వారం వారం సరఫరా పద్ధతిలో కిలో నాణేల ధర 39,990కి చేరింది.