బిజినెస్

సెనె్సక్స్ భారీ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 28: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సోమవారం ప్రతికూల సూచీలు నమోదయ్యాయి. సోమవారం జరగాల్సిన కేంద్ర కేబినెట్ సమావేశం జరగకపోవడం, ఈనెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా, మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుండడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సానుకూల ధోరణులు ఎక్కడా కనిపించకపోవడంతో, సెనె్సక్స్ 368.84 పాయింట్లు (1.20 శాతం) పతనమై, 35,656.70 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా మార్కెట్‌లో ప్రతికూల సెంటిమెంట్ బలంగా ఉన్న కారణంగా 119 పాయింట్లు (1.10 శాతం) పడిపోయి, 10,661.55 పాయింట్లుగా నమోదైంది. పలు ప్రముఖ కంపెనీల వాటాలు కూడా నష్టాల్లో ట్రేడ్ కావడం అటు బ్రోకర్లను, ఇటు మదుపరులను ఆందోళనకు గురి చేసింది. నష్టపోయిన కంపెనీల్లో ఎస్ బ్యాంక్ (5.46 శాతం), బజాజ్ ఫైనాన్స్ (5.40 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (3.82 శాతం), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (3.10 శాతం), హీరో మోటార్ (2.55 శాతం) ఉన్నాయి. అలాగే సన్ ఫార్మా (2.52 శాతం), బజాజ్ ఆటో (2.29 శాతం), వెదాంత (1.80 శాతం), యాక్సిస్ బ్యాంక్ (1.80 శాతం), ఐటీసీ (1.65 శాతం) కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. అయితే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 1.71 శాతం, కోల్ ఇండియా 1.51 శాతం, లార్సన్ అండ్ టుర్బో 1.17 శాతం, పవర్ గ్రిడ్ 0.97 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.56 శాతం లాభాలను ఆర్జించాయి. ఈ కంపెనీల షేర్లు నష్టాల నుంచి బయటపడడం స్టాక్ మార్కెట్ మరింత పతనం కాకుండా అడ్డుకుంది.
జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ప్రతికూల ధోరణులే కనిపించడంతో చాలా కంపెనీల వాటాల లావాదేవీలు నష్టాల్లోనే కొనసాగాయి. అదానీ పోర్ట్స్ అత్యధికంగా 12.53 శాతం నష్టాలను చవిచూసింది. ఇండియాబుల్స్ 6.51 శాతం, బజాజ్ ఫిన్ 5.45, ఎస్ బ్యాంక్ 5.28 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.30 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, 15.73 శాతం లాషాలను నమోదు చేశాయి. భారతి ఇన్‌ఫ్రా 2.39 శాతం, టీసీఎస్ 2.04 శాతం, కోల్ ఇండియా 2.01 శాతం, లార్సన్ అండ్ టుర్బో 1.29 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి.
ఈవారం స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ప్రారంభమవుతుందని అంచనాలు వేసినప్పటికీ, కేంద్ర కేబినెట్ సమావేశం రద్దుకావడంతో, మధ్యంతర బడ్జెట్‌లో ఏఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారనే విషయంపై ఎవరూ ఒక అవగాహనకు రాలేకపోయారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ సమీపిస్తున్నందున, మదుపరులు కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్టు మార్కెట్ కొనసాగిన తీరు స్పష్టం చేసింది. మొత్తం మీద, అత్యధికంగా 36,124.26, అత్యల్పంగా 35,565.15 పాయింట్లుగా నమోదైన సెనె్సక్స్ చివరికి 35,656.70 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 10,630.95 పాయింట్ల నుంచి 10,804.45 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సోమవారం నాటి ట్రేడింగ్‌ను స్థూలంగా పరిశీలిస్తే, పూర్తి ప్రతికూల వాతావరణంలోనే కొనసాగిందనేది స్పష్టమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, బడ్జెట్ తీరుతెన్నులపై ఊహాగానాలు స్టాక్ మార్కెట్‌పై బలంగానే పని చేశాయి.